Publish Date:Apr 30, 2026
చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు మళ్లీ హైదరాబాదు నగరానికి వచ్చి భారీ సోదాలు నిర్వహించడం నగరంలో కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన మురుగన్ ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించిన అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మురుగన్ నిర్మించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గుజరాత్ పోలీసులు మురుగన్‌కు సంబంధాలున్నట్లు భావిస్తూ హైదరాబాద్ లోని మూడు ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు నిర్వహించారు, 49ఐవీఎఫ్, సికింద్రాబాద్ హెగ్డే ఐవీఎఫ్, బంజారా హిల్స్, నోవా ఐవీఎఫ్, కూకట్‌పల్లిలకు మురుగన్ తో సంబంధాలపై ఈ సోదాలు జరిగాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, రికార్డులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది చైతన్యపురిలో వెలుగులోకి వచ్చిన కేసులో మురుగన్ పేరు మొదట బయటపడింది. ఆ సమయంలో మూడు నెలలు జైల్లో గడిపి బయటకు వచ్చిన అతను మళ్లీ అక్రమ కార్యక లాపాలను కొనసాగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
మురగన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఏడాదిలో దేశవ్యాప్తంగా సుమారు పాతిక మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మురుగన్ గ్యాంగ్ గుజరాత్ పోలీసుల అదుపులో ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని పేర్లు, మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gujarat-police-raids-in-hyderabad-36-218632.html
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.