ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు!!
Publish Date:Jan 26, 2019
Advertisement
70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. టెక్నాలజీతో ఉత్పాదకతను పెంచుతోందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మించుకున్నామని, జనవరి నుంచి పెన్షన్లను రూ.2 వేలకు పెంచామని తెలిపారు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం చేశామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సురక్షిత తాగునీటి కోసం వాటర్ గ్రిడ్ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని గవర్నర్ చెప్పారు.
http://www.teluguone.com/news/content/governor-esl-narasimhan-praises-ap-govt-39-85524.html





