మళ్లీ తెరపైకి గోరంట్ల మాధవుడు
Publish Date:Jun 17, 2023
.webp)
Advertisement
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి గోరంట్ల మాధవ్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేసినా.. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసినా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాశీ యాత్ర చేసినా.. వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ జైత్రయాత్రను ఆపలేరన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, సత్యకుమార్‌లపై సైతం విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో ఎంపీ గోరంట్ల కామెంట్లపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని.. అలాంటి వేళ ఎంపీ సీటు కోసం గోరంట్ల మాధవ్ చేస్తున్న ఫీట్ల అన్నీ ఇన్నీ కావని వారు పేర్కొంటున్నారు. అయితే గతేడాది ఆగస్ట్‌లో సదరు ఎంపీ గారి న్యూడ్ వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే తాను జిమ్ చేస్తుండగా ఉన్న వీడియోను ప్రత్యర్థి పార్టీల వారు ఇలా మార్ఫింగ్ చేశారంటూ ఆయన ఆరోపించారు.
వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. పోలీసు కేసు నమోదు చేస్తానని ప్రకటించారని.. మరి కేసులు నమోదు చేశారో లేదో తెలియదు కానీ.. ఓ వేళ కేసు నమోదు చేస్తే.. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఎంపీ గోరంట్ల మాధవ్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గోరంట్ల న్యూడ్ వీడియో ఒరిజనల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్స్ సైతం సర్టిఫై చేసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
అయితే ఇదే అంశంపై అప్పుడే.. ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రికి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి, జాతీయ మహిళా కమిషన్‌కు సైతం గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదులు అందాయని... కానీ ఆ వీడియో తాలుకు రహస్యం మాత్రం ఇప్పటికి బహిర్గతం కాలేదని వారు వివరిస్తున్నారు. మరీ వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్.. మళ్లీ టికెట్ దక్కుతోందా లేక.. ఈ సారికి.. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే చర్చ సైతం సాగుతోందని వారు చెబుతున్నారు. ఎందుకంటే.... గోరంట్ల వారిదిగా చెప్పబడుతోన్న న్యూడ్ వీడియో గట్టిగానే వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉంటే.. మళ్లీ జగన్ ప్రభుత్వం గద్దెనెక్కితే.. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఓ ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందనే ప్రచారం సాగుతోందని నెటిజన్లు చెబుతున్నారు. మరి గోరంట్ల వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందనేది మరికొద్ది నెలల్లో తెలిసిపోతోందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/gorantla-madhav-crticise-tdp-39-156994.html












