మీకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలా.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!

Publish Date:Feb 27, 2025

Advertisement

 


ప్రతి మనిషి తన జీవితంలో వివాహం అనే దశను చేరుకుంటాడు.  సంసార సాగరంలో ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకుని ఈదుతూ ఉంటాడు. చాలామంది సింగిల్ గా ఉన్నప్పుడు జీవితం చాలా బాగుండేది.. వివాహం అయ్యాక స్వేచ్ఛ పోయింది అనే మాట అంటుంటారు. ఇంకొందరు ఏమో తన ఆలోచనలు, అభిరుచులకు సరైన భాగస్వామి రాలేదు అని అంటుంటారు. ఇప్పటికే పెళ్లైన వారిలో చాలామంది పెళ్లే వద్దు బాబోయ్ అని వివాహ బంధం గురించి తమ అనుభవాలను చెప్పి ఇతరులను భయపెడుతూ ఉంటారు. అయితే మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  మంచి పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు వెల్లడించాడు.  అవేంటో తెలుసుకుంటే..

పెళ్ళి చేసుకునే ఆలోచన ఉన్నవారు.. లైఫ్ పార్ట్నర్ ను ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

నిజాయితీ..

నిజాయితీగా ఉండే వ్యక్తులు మాత్రమే జీవితంలో మంచి లైఫ్ పార్ఠ్నర్ లు కాగలరు. అబద్దాల కోరును ఎవరూ నమ్మరు.  ఒకవేళ పెళ్లి తరువాత ఇలాంటి వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నా అబద్దాలు చెప్పడం వల్ల ఆ సంసారం ఎప్పటికీ సంతోషంగా ఉండదు.

దయ..

ఇతరుల పట్ల దయా గుణం కలిగిన వారు మంచి లైఫ్ పార్ట్నర్ లు గా ఉండగలరు. బయటి వ్యక్తుల పట్ల దయ చూపించే వారు భాగస్వామి విషయంలో మరింత ప్రేమ, దయ,  సానుభూతి, పరిస్థితులను అర్థం చేసుకోవడం చేయగలరు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలలో బ్యాలెన్స్డ్ గా ఉండగలరు.

మర్యాద..

ఇతరులకు మర్యాద గౌరవం ఇవ్వడం తెలిసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరినీ అకారణంగా నొప్పించరు. తన  లైఫ్ పార్ట్నర్ ను కూడా చాలా విలువైన వ్యక్తిగా భావిస్తారు. మర్యాద ఇవ్వడం,  గొప్ప స్థానాన్ని ఇవ్వడం చేస్తారు.   అయితే ఈ గుణాలన్నీ ఉన్నట్టు నటించే వ్యక్తులు కొందరు ఉంటారు. కాబట్టి వ్యక్తులను సులువుగా ఎంచుకోకుండా కాస్త సమయం తీసుకోవడం మంచిది.  వ్యక్తి గురించి విచారించడం కూడా మంచిది.  ఒక వ్యక్తి జీవితంలో జీవితాంతం కలిసి ఉండేది భాగస్వామి మాత్రమే కాబట్టి.. భాగస్వామి విషయంలో ఎప్పుడూ తొందరపాటు అడుగులు వేయకూడదు.


                                                *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.