కట్నం కన్నా విలువైన బహుమతులు.. ఇవి ఇస్తే కూతుళ్ల భవిష్యత్తు బంగారంలా ఉంటుంది..!

Publish Date:Jun 27, 2026

Advertisement

ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి..

విద్య, నైపుణ్యాలు..

విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు.
ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు.

విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది.

పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.  

ఆర్థిక భద్రత..

నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి.

ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది.

ఆత్మవిశ్వాసం..

జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి.

స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు.

నడవడిక, విలువలు..

సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది.

ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం..

పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.

                              *రూపశ్రీయ

By
en-us Political News

  
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.