Publish Date:May 11, 2022
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి సముద్ర తీరానికి అసని తుపానులో కొట్టొకొచ్చిన బంగారు రథం మిస్టరీ దాదాపు వీడిపోయింది. బంగారు రంగుతో మెరిసిపోతున్న ఈ స్వర్ణ రథాన్ని స్థానికులు తాళ్లతో లాగి ఒడ్డుకు చేర్చారు. దేవుని ఊరేగింపులో ఉపయోగించే వాహనం మాదిరిగా అది కనిపిస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుకు సముద్రంలో కొట్టుకు వచ్చిన ఆ వింత వాహనం బంగారు రంగుతో మెరిసిపోతోంది. దాన్ని నిజంగా బంగారు రథమే అని స్థానికులు కొందరు భావించారు. దాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దాంతో పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
ఈ బంగారు రథం మయన్మార్ నుంచి కొట్టుకువచ్చినట్టు క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు నిర్ధారణకు వచ్చారు. మయన్మార్ లో సన్యాసం తీసుకునే యువతీ యువకులను ప్రత్యేకంగా తయారుచేసిన వాహనాల్లో భారీ ఎత్తున ఊరేగిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రతీరానికి కొట్టుకు వచ్చిన మాహనం కూడా అలాగే కనిపిస్తోందని అధికారులు చెప్పారు. అయితే.. ఈ వాహనం పెద్దగా కనిపిస్తోందన్నారు. ఊరేగింపు తర్వాత ఈ వాహనాన్ని సముద్రంలో నిమజ్జనం చేసి ఉంటారని, అది పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో తుపాను తీవ్రతకు ఇలా కొట్టుకుని వచ్చి ఉంటుందంటున్నారు.
ఈ వాహనంపై ఈ ఏడాది జనవరి 16 తేదీ ఉండడంతో నాలుగు నెలల క్రితమే దీన్ని తయారుచేసి ఉంటారని, అందుకే కొత్తగా ధగధగలాడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ బంగారు రథం రూపురేఖలు, డిజైన్లు అన్నీ కూడా బౌద్ధమతం ధీమ్ లో ఉందని వారు అన్నారు. కాగా.. మూడు నెలల క్రితమే నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి ఇలాంటి వాహనం ఒకటి కొట్టుకొచ్చింది. అయితే.. అది చాలా పాతగా కనిపించింది. ఆ వాహనంలో బుద్ధుని ప్రతిమ, చిత్రంతో, శివలింగం కూడా ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/golden-chariot-from-mayanmar-25-135759.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.