వివేకా హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐ అధికారులకే బెదరింపులు

Publish Date:May 11, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి.. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో.. ఊహించని ట్విస్టులు చేటు చేసుకొంటున్నాయి. దీంతో సీబీఐ అధికారులు తలలు పట్టుకొంటున్నారని సమాచారం. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. కడపలో సీబీఐ అధికారులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆగంతకులు అడ్డగించి.. ఈ నగరం నుంచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరిస్తున్నారట. తమకు వస్తున్న బెదిరింపులపై సీబీఐ అధికారులతోపాటు కారు డ్రైవర్.. స్థానిక చిన్న చౌక్ పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని సమాచారం. అందులోభాగంగా.. సీబీఐ అధికారులు, కారు డ్రైవర్‌ను బెదిరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు.. అందులోభాగంగా సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

వివేకా హత్య కేసు.. దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే గతంలో వారిని గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరోసారి.. సీబీఐ అదికారులపై ఆగంతకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో సీబీఐ అదికారులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే తాజాగా సీబీఐ అధికారులకే బెదిరింపులు రావడంతో.. కడప జిల్లాలో కలకలం రేగుతోంది. అయితే ఇదంతా అధికార పార్టీకి చెందిన వారే చేస్తున్నారని.. అందుకే పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఓ టాక్ అయితే తాజాగా జిల్లాలో జోరుగా వైరల్ అవుతోంది. 

2019, మార్చి 15న వైయస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత వివేకాది గుండెపోటు అంటూ నాటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. అలాగే సీఎం జగన్‌కు చెందినసొంత మీడియాలో సైతం ఇదే ప్రచారం చేశారు. ఆ తర్వాత వైయస్ వివేకా గుండెపోటుతో మరణించలేదని.. ఆయన దారుణ హత్యకు గురయ్యారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఆ క్రమంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ఈ హత్యపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సీట్)ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో.. తన తండ్రి హత్య కేసులో అసలు దోషులు ఎవరో తెలుస్తోందని వైయస్ వివేకా కుమార్తె వైయస్ సునీత వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వంలో సైతం తమకు న్యాయం జరగడం లేదనే విషయం ఆమె మెల్లగా అర్థమైందీ. ఈ నేపథ్యంలో వైయస్ వివేకా భార్యతోపాటు ఆయన కుమార్తె వైయస్ సునీత.. హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసి.. ఈ హత్య కేసును సీబీఐకు అప్పగించాలని అభ్యర్థించారు. దీంతో ఈ హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
 
ఆ తర్వాత వివేకా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు చేపట్టినా... విచారణ అంతగా ముందుకు సాగలేదన్నది మాత్రం సుస్పష్టమే. అయితే.. వైయస్ వివేకానందరెడ్డి మాజీ కార్ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి.. ఈ హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్నది.. అలాగే వివేకా హత్యకు సూపారీ ఎంత ఇచ్చారు.. తదితర అంశాలన్నీ సీబీఐకి దస్తాగిరి క్లియర్ కట్‌గా పూసగుచ్చినట్లు చెప్పేశారు. దాంతో తెలుగు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడారు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో నిందితులు అప్రమత్తమై.. ఈ కేసును పక్క తోవ పట్టించేందుకు పలు పథకాలు తెరపైకీ తీసుకొచ్చారు. ఆ క్రమంలో వివేకా హత్యను దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కాకుండా..  వైయస్ వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిలపై పోలీసు ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలంతా తీవ్ర కన్యూఫ్యూజ్‌కు గురయ్యారు. 
ఆ సమయంలో సీబీఐ అదికారులు సైతం ఢిల్లీకి వెళ్లిపోయి.. ఈ హత్య కేసులో విచారణ జరుగుతున్న తీరు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను సైతం సదరు సీబీఐ అధికారులు.. ఆ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు విపులీకరించారు. దాంతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు వారు అభయ హస్తం అందించారని సమాచారం. దీంతో సదరు సీబీఐ అధికారులు.. మళ్లీ కడపకు వచ్చి.. వివేకా హత్య కేసు దర్యాప్తును షూరు చేశారు. 

ఆ క్రమంలో ఢిల్లీ నుంచి నేరుగా సీబీఐ ఉన్నతాధికారి.. కడప సెంట్రల్ జైలు అతిథి గృహాంలో మకాం వేసి.. దర్యాప్తు చేశారు. అయితే అదే సమయంలో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటిసులు జారీ చేశారని.. కానీ వాటిని వారు తీసుకునేందుకు నిరాకరించినట్లు నాడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. అయితే తాజాగా వివేకా హత్య కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకోనుందని భావిస్తున్న తరుణంలో... సీబీఐ అధికారులకు ఆగంతకుల నుంచి బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. ఈ కేసు వివేకా కుమార్తె వైయస్ సునీత నివాసం వద్ద కూడా దుండగులు రెక్కీ నిర్వహించారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీంతో స్థానికంగా కలకలం రేగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో వైయస్ వివేకా హత్య కేసులో దోషులను పట్టుకునేందుకు సీబీఐకు మరింత కాలం పట్టవచ్చునని ఓ టాక్ అయితే కడప జిల్లాలో వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.