నవజాత శిశువుకు గోల్డ్ రింగ్ గిఫ్ట్.. తమిళనాడులో కొత్త పథకం

Publish Date:Jun 24, 2026

Advertisement

ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి చిన్నారి చేతికి ఇకపై బంగారు ఉంగరం మెరవ నుంది. మాతా, శిశు సంక్షేమా నికి పెద్దపీట వేస్తూ తమిళ నాడు ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహూకరించే   ‘తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్’ (మేనమామ బంగారు ఉంగరం పథకం)   అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో    జారీ చేసింది.

సాధారణంగా పుట్టిన బిడ్డకు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే అదే సంప్రదాయాన్ని ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఎలాంటి వివక్ష లేకుండా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించనున్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 755.83 కోట్ల రూపాయలు కేటాయించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో  విశ్వాసాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

 ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి చిన్నారికి బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం మరో వినూత్న సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
డిగ్రీ లేకుండానే ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ సింగ్..
తమిళనాడు సీఎం విజయ్ ఉదారత..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
హైదరాబాద్ నగరంలో గుండెల్ని పిండేసే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వేస్ట్..
నాగరాజు ఉండటం వల్లే తమ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి ముఠాల ఆగడాలు అణచివేయబడ్డాయని, తాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసలేం జరుగుతోంది, ఏం జరగాల్సి ఉందన్న విషయంపై ప్రముఖ విశ్లేషకుడు సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్టాడారు.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం
షాపూర్ ప్రాంతంలో వరద ముంపునకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, నిర్వాసితుల పక్షాన నిలబడి నిలదీసే ఒక సాహసోపేతమైన గొంతుగా భరత్ భూషణ్ తివారికి అక్కడ ఇమేజ్ ఉంది. అధికారుల అవినీతిని, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అక్రమాలను నేరుగా ఫీల్డ్ నుంచే కెమెరాలకు చూపిస్తూ.. నేరుగా పేర్లు పెట్టి హెచ్చరించే తివారి ధోరణి స్థానిక పాలకులకు, అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
కేవలం ఇదొక జీవన విధానం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భారీ వ్యాపార సామ్రాజ్యంగా అవతరించిందని ప్రముఖ విశ్లేషకులు భరద్వాజ చెప్పారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో ఈ కో లివింగ్ మార్కెట్ విలువ అక్షరాలా 4,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది.
ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.