కొత్తగా గోల్డ్ మానిటైజేషన్ పాలసీ...సర్వత్రా ఆసక్తి

Publish Date:May 13, 2026

Advertisement

 

త్వరలో కీలక నిర్ణయం తీసుకోనునన్న కేంద్ర ప్రభుత్వం..
 
బంగారం దిగుమతులు తగ్గితే రూపాయి విలువ బలోపేతం..

ప్రజలు ఇళ్లలో దాచుకున్న బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి,  దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. త్వరలో కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్ పాలసీ’ తీసుకురానున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా ప్రజల ఇళ్లలో నిల్వగా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా 10 గ్రాముల బంగారం ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసే అవకాశం కల్పించాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. అయితే ఈ బంగారం ఎక్కువగా ఇళ్లలోనే ఉండిపోవడంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదు. దీంతో ఏటా భారీ స్థాయిలో బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి విలువ కూడా ప్రభావితమవుతోంది. కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ ద్వారా ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. 

అదనంగా పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల సామాన్యులు ఇంట్లో ఖాళీగా ఉన్న బంగారంతో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక డిపాజిట్ చేసిన బంగారాన్ని జ్యూవెలర్లకు అందించే విధానం కూడా ఉండొచ్చని సమాచారం. దీంతో దేశీయ ఆభరణాల తయారీ రంగానికి ప్రయోజనకరమవుతుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం కనీసం 2,000 టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే మూడేళ్ల వరకు బంగారం దిగుమతుల అవసరం గణనీయంగా తగ్గవచ్చు. బంగారం దిగుమతులు తగ్గితే రూపాయి విలువ బలోపేతం కావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్రం తీసుకురానున్న కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


 

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.