Publish Date:Dec 29, 2023
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి అన్న సుమతీ శతకంలోని పద్యంలా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన రాజకీయ లబ్ధి కోసం అవసరానికి మాటలు మార్చేస్తుంటారు. నిన్నటి వరకూ నిప్పులు చెరిగిన నేతలనే నేడు పొగడ్తల వర్షంలో ముంచెత్తిస్తూ ఉంటారు. నిన్న ఔనన్న మాటని ఏ మొహమాటం లేకుండా నేడు కాదని చెప్పేస్తారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాలు, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ తొలి ప్రధాని దళితుడే అన్న మాటలను ఆ తరువాత మరెన్నడూ ఆయన కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు.
ఇక ప్రస్తుతానికి వస్తే గత రెండున్నర మూడేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలు పెట్టి ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని పదవికి మోడీ అనర్హుడు, ఆయనను గద్దె దించి ఇంటికి పంపిస్తానని కూడా అన్నారు. బీజేపీనీ బంగాళాఖాతంలో కలిపేస్తానని కూడా అన్నారు. ఈ విమర్శల వెనుక రాజకీయ వ్యూహాలు ఏమైనా కావచ్చు కానీ ప్రధాని హోదాలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీకి ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడానికి కూడా కూడా ఇష్టపడలేదు.
సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నెలల వ్యవధిలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికలలో కనీస స్ధానాల కోసం ఆయన బీజేపీ పంచన చేరడానికి అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే నిన్న మొన్నటి వరకూ బీజేపీపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎజెండా హిందుత్వను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత సనాతనధర్మానికి, హిందువులకి వ్యతిరేకం అంటూ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తుంటే.. ఆమె సోదరుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని ప్రకటించేశారు.
ఇదంతా బీజేపీకి దగ్గరవ్వడానికీ, మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకొనేందుకూ కేసీఆర్ తెరవెనుక ఉండి పన్నుతున్న వ్యూహంలో భాగంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీ సారథ్యంలో బీజేపీ గెలిచి మరోసారి అధికారంలోకి వస్తుందన్న సర్వేల నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీకి దగ్గరకావడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ అంతే రాజకీయ లబ్ధి కోసం అందితే జుట్టు అందకుంటే కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకాడరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేవలం ఎన్నికల భయమే కాకుండా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు భయం కూడా తోడవ్వడంతో మోడీని శరణువేడటం తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/general-elections-fear-39-167888.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.