తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నకు స్పందించిన డోలేంద్ర ప్రసాద్.. “తమిళనాడులో చిన్న భూకంపం వచ్చినా ఏపీలో ప్రకంపనలు కనిపిస్తాయి” అని వ్యాఖ్యానించారు.
దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే గట్టి సవాల్ విసిరిందన్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికలను “జెన్-జీ ఎలక్షన్స్”గా అభివర్ణిస్తూ, యువ ఓటర్లు భారీగా విజయ్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు చాలా వరకు కరెక్ట్‌గా ఉన్నాయని, విజయ్ పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చే అవకాశాన్ని ముందుగానే సూచించిందని చెప్పారు. గతంలో తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య అధికార మార్పిడి కొనసాగేదని, ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోందన్నారు.
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలవలేదని, ఎన్నికల కమిషన్ సహకారంతో గెలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముస్లిం ఓట్ల విభజన కారణంగా మమతా బెనర్జీకి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన డోలేంద్ర ప్రసాద్.. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ప్రజలు పూర్తిగా అంగీకరించలేదని, అలాగే చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారో 2029 ఎన్నికల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు.
అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లోకేష్ కీలక శక్తిగా ఎదుగుతున్నారని చెప్పారు. గత ఎన్నికల తర్వాత లోకేష్‌లో వచ్చిన పరిణతి, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ ఆయనను పార్టీ భవిష్యత్ నాయకుడిగా నిలబెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో లోకేష్‌ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించవచ్చు.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.