కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయంటున్న గద్దర్
Publish Date:Apr 27, 2023
Advertisement
తెలంగాణలో బీఆర్ఎస్ హవాకు, కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఇందిరాపార్క్ వద్ద టీ సేవ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిలతో పాటు పాల్గొన్న గద్దర్ ప్రసంగించారు. విూకు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండని అన్నారు. వైఎస్ షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని కవి గద్దర్ పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమే షర్మిల ప్రభుత్వంపై పోరాడుతోందని అన్నారు. అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల ఆత్మరక్షణ కోసం పోలీసులతో ఒకింత దురుసుగా ప్రవర్తించారనీ అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. తాను వైఎస్సార్టీపీలోనే కాదు ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నందునే షర్మలకు మద్దతుగా నిలిచానన్నారు. యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని గద్దర్ అన్నారు. షర్మిల అలా మారినందుకే ఆమె పోరాటాలను అణిచివేయాలని తెలంగాణ సర్కార్ చూస్తోందని గద్దర్ విమర్శించారు. కేసీఆర్‌కి ఇవే చివరి ఎన్నికలని గద్దర్ వ్యాఖ్యానించారు. 'సర్కార్ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట' అనే నినాదంతో చేపట్టిన ఈ దీక్షలో షర్మిల టీసేవ్ నిరుద్యోగ నిరాహార దీక్ష ఆపాలని ప్రయత్నంలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఒక్క మహిళను అడ్డుకోవడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ దిగిందని మండిపడ్డారు. సిట్ ఆఫీస్‌కు వెళ్తుంటే అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు. నేను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం అన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలలో కూరుకుపోయిందని విమర్శించారు. కేసీఆర్ వాటర్ స్కాం, బిడ్డ లిక్కర్ స్కాం, కొడుకు టీఎస్‌పీఎస్సీ పేపర్ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. సి టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో ఐటీ లోపాలు ఉన్నాయన్నారు. పేపర్ హ్యాక అయ్యిందని స్వయంగా చైర్మన్ చెప్పారన్నారు. ఇదేనా ఐటీ శాఖ భద్రత అని ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీకి పారదర్శకత ఉందంటారని.. పేపర్ లీక్ అయ్యేసరికి తనకేం సంబంధం లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/gaddar-criticise-telangana-cm-kcr-25-154328.html





