పోలీసుల ఆధ్వర్యంలో చౌమొహల్లా ప్యాలెస్‌లో ఇఫ్తార్ విందు

Publish Date:Mar 5, 2026

Advertisement

 

 

 

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ నగరంలో మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఘనంగా ‘దావత్-ఎ-ఇఫ్తార్’ విందు జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం చారిత్రక కట్టడం అయిన చౌమొహల్లా ప్యాలెస్‌లో  ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేయడం సమాజానికి ఆదర్శమని అన్నారు. రంజాన్ మాసం ప్రేమ, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్ర సమయమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి ముస్లిం సంస్కృతి ప్రత్యేక గుర్తింపునిచ్చిందని, ఇక్కడి మత సామరస్యం దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.


మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనంగా నిలిచిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అన్యోన్యంగా కలిసి జీవించడం ఈ నగర ప్రత్యేకత అని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రంజాన్ మాసంలో ప్రార్థనలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ పోలీస్ విభాగం నిర్వహించే ఇఫ్తార్ విందు నగరంలోని గంగా-జమునీ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని అన్నారు. 

ప్రజల సహకారంతోనే పోలీస్ వ్యవస్థ ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని సంపాదించుకుందని చెప్పారు. ప్రేమ, సోదరభావం, మానవత్వం హైదరాబాద్ నగరానికి అసలైన గుర్తింపని పేర్కొన్నారు. నగర చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా పోలీస్ డివిజన్ల పేర్లను మార్పులు చేయడం జరిగిందని కూడా వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఓర్పు, క్రమశిక్షణ, మానవీయ విలువలను బోధించే పవిత్ర కాలమని అన్నారు. హైదరాబాద్ గంగా-జమునీ తహజీబ్‌కు నిలయమని పేర్కొంటూ ముస్లిం సోదరులు పాటించే నియమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. 

నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రాథమిక బాధ్యత అని, ప్రతి పౌరుడి భద్రత కోసం పోలీస్ యంత్రాంగం 24 గంటలు విధుల్లో ఉంటోందని చెప్పారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు పోలీసులకు, ప్రజలకు మధ్య నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, పీస్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, పోలీస్ అధికారులు పాల్గొని రంజాన్ మాసపు ఆధ్యాత్మిక సందేశాన్ని పంచుకున్నారు. నగరంలో శాంతి, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ముగిసింది.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ,  రాష్ట్ర డీజీపీ బీ. శివధర్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ అమిత్ గార్గ్  తదితరులు పాల్గొన్నారు.
 

By
en-us Political News

  
కాక్రోచ్ జనతాపార్టీ విడుదల చేసిన ఒక ప్రకనటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశ యువత అంటే జన్ జీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి భ‌య‌ప‌డ‌టం లేద‌ని పేర్కొంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో గురువారం (జూన్ 11) పూణేలో ఆందోళ‌న చేప‌ట్టింది. ఆ త‌రువాత ల‌క్నో, అమృత్‌స‌ర్‌, బెంగ‌ళూరు, జైపూర్‌, హైద‌రాబాద్‌లో కూడా ఆందోళ‌న‌లు నిర్వహిస్తామనీ, ఈ నెల 13లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయ‌క‌పోతే జూన్ 20న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌వ‌ధిక ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని పేర్కొంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోగా, ఐటీ రంగ షేర్లు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ బ్యాంకింగ్ రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు యూపీఐ మోసాల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలు మరియు సైబర్ ముప్పుల గురించి బయోక్యాచ్ (BioCatch) తాజా నివేదిక వెల్లడించిన షాకింగ్ గణాంకాలు మీకోసం.
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి, 200 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నిర్లక్ష్యపు షాట్‌తో హాఫ్ సెంచరీని ఎలా చేజార్చుకున్నాడో పూర్తిగా చదవండి.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.