Publish Date:Aug 17, 2022
కాస్తంత చదువుంటే ఎవరయినా రాజకీయాల్లోకి రావచ్చు. ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇదో అవకాశం. నిరుద్యోగి విసిగెత్తి రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకున్నా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన కాలం కాదిది. సామాజిక పరిస్థితులు, రాజకీయ నాయకులు, పార్టీలు వ్యవహరిస్తున్న తీరు పట్ల విసిగెత్తి తన ప్రాంతానికి తానే ఏదో ఒక మేలు చేయాలన్న గట్టి నిర్ణయం తీసేసుకుని రాజకీయాల్లోకి దిగి ఏకంగా సీఎం కావడం సినిమాల్లో చూస్తాం.
అంతకాకున్నా కనీసం ఎమ్మెల్యే కావడానికి వాస్తవ రాజకీయాల్లో అవకాశం ఉంది. బీహార్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్తికేయ పై ఇంతకు ముందే కేసులు ఉన్నాయని తెలిసింది. అలాంటి కోర్టు పక్షిని మంత్రిమండలిలోకి ఎలా తీసుకుంటారని నీతిస్‌పై దుమారం మొద లయింది.
గతంలో ఎంత అద్భుతం కాకున్నా, రాజకీయాలు వంటపడితే నేత కావచ్చునన్నది బీహార్ రాజకీయాల్లో నే గమనించగలం. ఇపుడు తాజాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ క్యాబినెట్‌లోకి 31 మందిని తీసు కున్నారు. ఇందులో 16 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆర్జేడీ ఎమ్మెల్సీ కార్తికేయ సింగ్ న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వివాదానికి దారి తీసింది.
కిడ్నాపింగ్ కేసులో కార్తికేయ సింగ్ ఈనెల 16న దనపూర్ కోర్టులో లొంగిపోవాల్సి ఉండగా, ఆయన నేరు గా పాట్నాలోని రాజ్‌భవన్‌కు చేరుకుని మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, కళంకిత మంత్రిని క్యాబి నెట్ లోకి తీసుకోవడం నితీష్‌ను ఇరకాటంలోకి నెట్టింది. '
కానీ కార్తీకేయ కేసుల గురించి తనకు ఏమీ తెలియదని, అసలు అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తన వద్ద లేదని, ఎవరూ తెలియజేయలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fortunate-minister-25-142106.html
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.