దేశ ద్రోహిగా ఉరికంభం ఎక్కనున్న ముషారఫ్.. ఉరిశిక్ష విధించిన పాక్
Publish Date:Dec 17, 2019
Advertisement
పాక్ మాజీ అధ్యక్ష్యుడు, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్‌లోని ఓ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ముషారఫ్ పై దేశ ద్రోహం కేసుతో పాటు అవినీతి కేసులున్నాయి. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ సంచలన తీర్పును వెల్ల డించింది. ప్రస్తుతం ముషారఫ్ దుబాయిలో తలదాచుకుంటున్నారు. ముషారఫ్ వాదనలను పరిగణలోకి తీసుకోవటానికి ప్రత్యేక కమిటీ దుబాయ్ కు వెళ్లారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముషారఫ్ కుట్ర చేశారని కేసులు నమోదయ్యాయి. ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధమని ఆయన తరపు న్యాయవాదులు అంటున్నారు. ముషారఫ్ పై వచ్చిన అభియోగాలు విచారించేందుకూ జ్యుడీషియల్ కమిషన్ వేయాలని కోరారు. ముషారఫ్ 2016లోనే దుబాయి పారిపోయారు. 2013లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 2007లో రాజ్యాంగాన్ని కూలదోసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అనేక మంది న్యాయమూర్తులను ఆయన ఇళ్లలలోనే నిర్బంధించారు. ఆరేళ్ల విచారణ తరువాత ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు ముషారఫ్ కు ఉరిశిక్షను సమర్థించారు. కాగా రాజద్రోహం కేసులో ఓ మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. మొత్తానికి దేశద్రోహం కేసులో ముషరఫ్ కి ఉరిశిక్ష పడడం అనే అంశం అందరికి షాక్ కి గురి చేసింది.
http://www.teluguone.com/news/content/former-pakistan-president-musharraf-gets-death-penalty-39-92305.html





