వైసీపీలో గుడివాడ అమర్నాథ్ సినిమా అయిపోయిందా?

Publish Date:Jun 11, 2025

Advertisement

వైఎస్ జగన్ హయాంలో ఏపీ ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. గుడివాడ అమర్నాథ్ కు గుడ్డు మంత్రి అన్న బిరుదును కూడా సంపాదించుకున్నారు.  ఇక గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న  అతి కొద్ది మంది పార్టీ నేతలలో గుడివాడ కూడా ఒకరిగా ఉంటూ వచ్చారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా? లేదా అన్నట్లుగా ఆయన తీరు మారిపోయింది. పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆయన తీరును చూసి వైసీపీ వర్గీయులే ఆయన సినిమా అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో గుడివాడ అమర్నాథ్ అంతగా పార్టీకి దూరంగా మెసలడానికి కారణాలపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద  గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇన్ చార్జిగా నియమిం చలేదన్న అసంతృప్తి ఆయనలో బాగా పేరుకుపోయిందంటున్నారు. 

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అతి కొద్ది మంది నేతలలో గుడివాడ కూడా ఒకరని ముందే చెప్పుకున్నాం కదా? అలా మాట్లాడటమే కాదు.. తరచూ విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయానికి వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో కూడా గుడివాడ ముందుండేవారు. అటువంటి ఆయన ఇటీవల అసలు పార్టీ కార్యాలయం ముఖమే చూడటం లేదు.  ఇందుకు కారణంగా ఆయన కోరుకున్న విశాఖ నగరం ఇన్ చార్జి పదవి దక్కకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యంత ఘోరం అనదగ్గ ఓటమిని చవి చూశారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి  తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. గుడివాడ అమర్నాథ్ పై పల్లా శ్రీనివాస్ ఏకంగా  95 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే  గుడివాడ విశాఖలో వాలిపోయారు.   విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని గుడివాడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం, రూరల్ కూడా కాకుండా  చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారంటున్నారు.  అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను జగన్ పీకేశారు. ఇది తనకు పొమ్మనలేక పొగపెట్టడంగానే గుడివాడ అమర్నాథ్ భావిస్తున్నారంటున్నారు. 

2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయనను  ఆ నియోజకవర్గ నుంచి తప్పించి చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇవ్వడమే అవమానం అనుకుంటే.. ఎన్నికల తరువాత గాజువాక ఇంచార్జ్ గానైనా కొనసాగించకుండా  తప్పించడం,  పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో.. గుడివాడ కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారన్న భావనకు వచ్చేశారంటున్నారు. అందుకే పార్టీకీ, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ సైలెంటైపోయారని పరిశీలకులు విశ్లేషి స్తున్నా రు. 

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.