గాంధీభవన్‌లో రచ్చ రచ్చ... కాంగ్రెస్ నేతల బాహాబాహీ!

Publish Date:May 27, 2026

Advertisement

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి, తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక ప్రతిష్టాత్మక సమావేశం, ఊహించని విధంగా నేతల మధ్య వీధిపోరాటంగా మారిపోయింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలంపై చర్చించేందుకు ఈ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ తీవ్ర ఘర్షణకు ప్రధాన కారణం ప్రోటోకాల్ వివాదమేనని తెలుస్తోంది. సీనియర్ నాయకులకు దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం, చూస్తుండగానే పెద్ద వివాదానికి దారితీసింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ, నీవా-నేనా అన్నట్లుగా దూషణలకు దిగారు. వాతావరణం వేడెక్కడంతో పరస్పరం చొక్కాలు పట్టుకుని భౌతిక దాడులకు దిగడం అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. 

తీవ్ర ఉద్రేగానికి లోనైన ఉస్మాన్ హాజారీ, ఫిరోజ్‌ఖాన్‌పై నేరుగా చేయిచేసుకుని చెంపదెబ్బ కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘోరమైన ఘర్షణ అంతా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ వంటి అత్యున్నత స్థాయి ముగ్గురు కీలక నేతల సమక్షంలోనే జరగడం గమనార్హం. దాదాపు వంద మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు ఉన్న ఆ హాల్‌లోనే ఈ భౌతిక దాడి జరగడం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.

సమావేశ మందిరంలో గొడవ పెద్దది కావడంతో ఇరు వర్గాల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో గాంధీ భవన్‌ ఆవరణ మొత్తం కేకలు, నినాదాలతో రసాభాసగా మారింది. అక్కడ ఉన్న మంత్రులు, సీనియర్ నేతలు ఇరువర్గాలకు నచ్చజెప్పి, శాంతింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నేతలు ఎవ్వరూ శాంతించకపోవడంతో, తీవ్ర అసహనానికి గురైన మంత్రులు తమ సమీక్షా సమావేశాన్ని మధ్యలోనే, అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.

 నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించడం పక్కన పెడితే, ఇలా సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, విపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా దొరికినట్లయింది.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.