భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు. ప్రభుత్వ అధికారుల అవినీతి వ్యవహారాలపై కొనసా గుతున్న తనిఖీల్లో భాగంగా, అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు భారీ లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీ అంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాంతపురి సుజాత అనే మహిళ భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) గా పనిచేస్తుంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO) మరియు చర్ల ఇన్చార్జ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భూక్య కృష్ణ పనిచేస్తున్నారు.
అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం పుష్పుగుప్ప గ్రామం నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు 2025లో నిర్మాణం చేపట్టిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనుల సందర్భంగా, కొన్ని చెట్లను నరికి వేయడం జరిగింది... దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ని బాధితుడు అటవీ శాఖ అధికారులను కలిశాడు. అయితే బీటీ రోడ్డు పనుల సందర్భంగా, కొన్ని చెట్లకు నష్టం జరిగిందన్న ఆరోపణలపై కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు, అలాగే భవిష్యత్తులో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని చెప్పి ఈ ఇద్దరు అధికారులు ఫిర్యాదిదారుడిని లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
మొదట గా రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసిన అధికారులు, తర్వాత ఫిర్యాదు దారుడి అభ్యర్థనతో మొత్తం మొత్తాన్ని రూ.3.50 లక్ష లకు తగ్గించారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఏసిబి అధికా రులు వలపన్ని ఈరోజు ఇద్దరు అధికారులు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదనంతరం,ఈ ఇద్దరు అధికారుల నుండి లంచం డబ్బును స్వాధీనం చేసుకుని... నిందితులను అరెస్టు చేసి వరంగల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసా గుతోంది. నిందితులు తమ అధికారిక పదవులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లాభం పొందే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు వెల్ల డించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదిదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్(9440446106), సోషల్ మీడియా వేదికలు మరియు ఏసీబీ QR కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/forest-department-officials-caught-in-acbs-trap-for-rs-350-lakh-bribe-36-219172.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.