ఆడపిల్ల పుడుతుందనే.. బలవంతపు అబార్షన్.. తల్లీబిడ్డల ప్రాణాలు బలి..!
Publish Date:Jul 27, 2026
Advertisement
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం... కన్న కూతురి ప్రాణాన్నే బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది."గర్భంలో పెరుగుతున్న శిశువు... ఆడపిల్ల అని తెలిసింది. ఆ క్షణం నుంచి ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో... అమానుష నిర్ణయం తీసుకున్నారు. కూతురు, అల్లుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. "ఆడపిల్ల వద్దు" అనే ఆలోచన... చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. అక్రమంగా నిర్వహించిన గర్భస్రావం వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాల కోసం పోరాడిన శ్రావణి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంకా ఈ లోకాన్ని చూడని పసికందు కూడా... తల్లి ఒడిని చేరకముందే శాశ్వతంగా దూరమైంది. ఒక ఆడబిడ్డ పుట్టకూడదనే నిర్ణయం... చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఒకటి గర్భంలోని చిన్నారి... మరొకటి ఆ చిన్నారికి జన్మనివ్వాల్సిన తల్లి. ఆడపిల్ల పుడుతుందనే కారణంతో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం చివరకు కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకుంది. కూతురు, అల్లుడి ఇష్టాన్ని ఏమాత్రంపట్టించుకోకుండా గర్భంలో ఆడ శిశువు ఉందని తెలుసుకున్న తల్లి, బలవంతంగా గర్భస్రావం చేయించింది. అక్రమంగా నిర్వహించిన ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావానికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన జనగామ జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం మృతురాలు శ్రావణి గర్భవతిగా ఉండగా స్కానింగ్ ద్వారా గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లుగా తల్లి శోభ తెలుసుకున్నారు. అనంతరం కూతురు, అల్లుడి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మృతురాలి తల్లి శోభ, జనగామలో ఏఎన్‌ఎంగా (ANM) పనిచేస్తున్న అనసూయ సహకారంతో ఈ నెల 21న ఆమె ఇంట్లో నే అక్రమంగా అబార్షన్ చేయించింది.అబార్షన్ అనంతరం 22వ తేదీ రాత్రి శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. తొలుత జనగామలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణిం చింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న శ్రావణి మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతురాలి భర్త భాస్కర్ జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆర్‌ఎంపీ శ్రవణ్, స్కానింగ్ నిర్వహించిన ప్రవీణ్, ఏఎన్‌ఎం అనసూయ, మృతురాలి తల్లి శోభపై కేసులు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 125, 89, 49తో పాటు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) Act సెక్షన్లు 5, 5(3), 5(4), అలాగే ఫ్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) Act సెక్షన్ 23 కింద కేసులు నమోదు చేశారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ ఎలా జరిగింది? అక్రమ అబార్షన్‌కు ఎవరు సహకరించారు? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు Forced Abortion, Female Foeticide, Sex-Selective Abortion, Gender Discrimination, Janagama district, Shravani, baby girl, Crime News, Shocking Incident, Medical Negligence, PCPNDT Act, MTP Act, BNS Case
http://www.teluguone.com/news/content/forced-abortion-36-227211.html





