గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు జాలర్లు మృతి.!
Publish Date:Jul 18, 2026
Advertisement
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గోదావరి నదిలో శనివారం (జులై 18) విషాదం చోటుచేసుకుంది. చేపల వేట కోసం నదిలోకి దిగిన ఐదుగురు జాలర్లు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన 11 మంది జాలర్లు గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో చేపల వేట కోసం వెళ్లారు. ఈ క్రమంలోనే బసిబోయిన బాలరాజు (38), ఊయిక రమేష్ (38), తుర్రం భారతి (40), ఊయిక లక్ష్మి (37), ఊయిక సుశీల (37) నదిలోకి దిగారు. కానీ నది లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు జాలర్లు ఒకేసారి మృతి చెంద డంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Five fishermen die while fishing, Godavari River, Polavaram District, Gommukottagudem
http://www.teluguone.com/news/content/five-fishermen-die-while-fishing-36-226414.html





