కెనడాలో కాల్పుల కలకలం.. పది మంది మృతి
Publish Date:Feb 10, 2026
Advertisement
కెనడాలో కాల్పులు కలకలం రేపాయి. బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్‌లో ఉన్న ఓ స్కూల్‌లో జరిగిన కాల్పులలో కాల్పులు జరిపిన వ్యక్తి సహా పది మంది మరణించారు. మరో పాతిక మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం (ఫిబ్రవరి 10) టంబ్లర్ రిడ్జ్ స్కూల్‌తో పాటు సమీపంలోని ఓ నివాస గృహంలో కూడా కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్కూల్‌ను చుట్టుముట్టారు. లోపల గాలింపు చేపట్టగా, పలువురు మృత్యువాత పడి ఉండటాన్ని గుర్తించారు. నిందితుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో, ఈ వారం మొత్తం స్థానిక స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/firing-in-canada-36-213836.html
http://www.teluguone.com/news/content/firing-in-canada-36-213836.html
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026
Publish Date:Jun 11, 2026





