డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ఇలా చెక్ పెట్టవచ్చు..!

Publish Date:Dec 17, 2024

Advertisement



డబ్బు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది.  సిల్లీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును మనిషే కనిపెట్టాడు.  డబ్బు సంపాదించేది కూడా మనిషే.. కానీ మనిషి చేతిలోకి రాగానే ఆ డబ్బు మనిషిని కిందా పైనా చేస్తుంది.   ఈ డబ్బు కేవలం బయటి వాళ్ల మధ్యనే కాదు.. ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తుంది.  ఆఖరికి జీవితాంతం కలిసి బ్రతకాలని ఒక్కటిగా మారిన భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చేలా చేస్తుంది. కానీ ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం,  కొన్ని చిట్కాలు పాటించడం వల్ల డబ్బు కారణంగా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. భార్యాభర్తల జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది కూడా.


మీకోసం డబ్బు కావాలి.. డబ్బు కోసం మీరు కాదు..

డబ్బు అనేది మనుషుల మధ్య ఎంత విభేదాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.. ఇద్దరు వ్యక్తులు ఒక బంధంగా ఏర్పడిన తరువాత ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి.  బయటి వ్యక్తుల కోసమో.. డబ్బు కోసమో.. భాగస్వామిని తక్కువ చేయడం డబ్బే ఎక్కువ అనుకోవడం చేయకూడదు.  దీని వల్ల డబ్బు కోసమే బంధం కలుపుకున్నారని అనుకుంటారు. అందుకే డబ్బును అవసరమైన వస్తువుగా చూడాలి.


మాట్లాడుకోవాలి..

భార్యాభర్తులు ఇద్దరూ సంపాదించేవారు అయినా,  కేవలం భర్త మాత్రమే సంపాదిస్తున్నా ఇద్దరూ కలిసి ఆర్థిక విషయాలు చర్చించుకోవడం ముఖ్యం.  భార్యలకు ఆర్థిక విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే మగవాళ్లు ఆర్థికంగా ఎదగడం లేదనే విషయాన్ని సాక్షాత్తూ సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ఆర్థికంగా బలపడాలి, ఎదగాలి అనే ఇప్పటి తరం అమ్మాయిలు అనుకుంటారు.  ఇంకా చెప్పాలంటే ఆర్థిక విషయాలలో అమ్మాయిలే ఒక అడుగు ముందుంటారు. భార్యకు చెప్పకుండా ఏ ఆర్థిక కార్యకలాపం చేయకూడదు. అలాగే భర్తకు చెప్పకుండా భార్య కూడా ఆర్థిక విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక నిర్ణయాలు ఉమ్మడిగా ఉండాలి.

సంపాదన..

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయి.  ఇద్దరికీ కలిపి ఎంత శాలరీ వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం ముఖ్యం.  అంతేకాదు.. ఒకవేళ భార్యకు ఉద్యోగం లేకపోయినా సరే... భార్త భార్యకు తన సంపాదన గురించి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.  సంపాదన గురించి స్పష్టంగా చెప్పినప్పుడే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు.

బడ్జెట్..

బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరం.  దీని వల్ల ఆర్థిక విషయాలు ఎలాంటి గోల లేకుండా సాఫీగా సాగుతాయి.  భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైతే.. ఇద్దరి శాలరీ నుండి ఇంటి బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి.  దీని వల్ల ఇద్దరికీ ఇంటికోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అనే అవగాహన వస్తుంది.


సేవింగ్స్..

బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తరువాత ఇద్దరూ కలిసి సేవింగ్స్ పైన దృష్టి పెట్టాలి.  ఇద్దరూ కలసి చేసుకునే సేవింగ్స్ లో ఎవరు ఎవరినీ నొప్పించేలా ఉండకూడదు.  ఏ విధమైన సేవింగ్స్ చేస్తే ఇద్దరి భవిష్యత్తుకు మంచిదని చూడాలి తప్ప నా పేరుతో సేవ్ చేయాలి అంటే నా పేరుతోనే అనే వాదనలు వద్దు. ఒకవేళ డబ్బంతా అకౌంట్ లో పెట్టాలి అనుకుంటే ఇద్దరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో వేసుకోవాలి.  ఇద్దరికీ సంబంధించి కనీసం ఆరు నెలల నుండి ఏడాది జీవనం గడిచేలా డబ్బును ఆర్థిక భద్రతగా ఉంచుకోవాలి.  ఏదైనా పరిస్థితి ఎదురై ఇద్దరూ చాలా కాలం పాటు ఉద్యోగం చేయలేకపోయినా ఈ డబ్బే భరోసా ఇస్తుంది.


సెల్ఫ్ గా..

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే వారిద్దరి శాలరీలో ఇద్దరూ తమకంటూ సెల్ఫ్ గా కొద్దిగా ఫండ్ ను క్రియేట్ చేసుకోవాలి. దీని గురించి ఎవరూ ఎదుటివారిని ప్రశ్నించకూడదు.  ఏనైనా ఇష్టాలు,  కొనాలనుకునే ప్లానింగ్స్ ఉంటే అవి కూడా ఈ సెల్ఫ్ మనీలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ మీద భారం ఉండదు.  

భవిష్యత్తు..

వాస్తవ జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అని ఆలోచించేవారే ఎక్కువ. కానీ భవిష్యత్తు ప్లానింగ్స్ కూడా ఫర్పెక్ట్ గా ఉండాలి. ఇలా చేస్తే రేపటి రోజున కూడా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండగలుగుతారు.  ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండి.. దాన్ని భాగస్వామికి అర్థమయ్యేలా వివరించగలిగితే చాలా వరకు డబ్బు కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావు.

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.