కన్నబిడ్డలను ఖతం చేసిన కర్కొటక తండ్రి
Publish Date:Apr 3, 2026
Advertisement
కన్నబిడ్డలిద్దరినీ చంపేసిన తండ్రి ఉదంతమింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలనూ హత్య చేసిన కర్కొటక తండ్రి ఉదంతమిది. ఈ ఘటన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో నివాసం ఉంటున్న గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు కవల కుమార్తెలు. కుటుంబ కలహాల నేపథ్యం లో తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైలం.. ఐదేళ్ల వయసు ఉన్న తన ఇద్దరు కుమార్తెలకు గడ్డి మందు తాగించి బావిలో పడేశాడు. అక్కడనుండి పారిపోతున్న శ్రీశైలంను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో బావిలో చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా, ఒక కూతురు మృతదేహం లభ్యం కాగా ,మరో కూతురి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. .
http://www.teluguone.com/news/content/father-kill-his-daughtersm-karimnagar-36-216645.html





