ఉపవాసంతో కేన్సర్‌ మాయం

Publish Date:Dec 14, 2016

Advertisement

 


‘లంకణము పరమౌషధం’ అంటుంటారు పెద్దలు. కాకపోతే ఇదేదో జ్వరం, అజీర్ణం, కఫంలాంటి చిన్నాచితకా వ్యాధులకి సంబంధించిన సూత్రం అనుకునేవారం. కానీ ఏకంగా కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులలోనూ ఉపవాసం ఉపశమనాన్ని కలిగిస్తుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ నమ్మక తప్పదు!

 

ALL అనగా

బ్లడ్‌ కేన్సర్‌ అన్న పేరు వింటేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్ని బయపెట్టి, బాధపెటట్టి కొంచెంకొంచెంగా మృత్యువుకి చేరువచేసే ఈ తరహా కేన్సర్‌ పగవాడికి కూడా రావద్దు భగవంతుడా అనిపిస్తుంది. లుకేమియా అనేది ఆ బ్లడ్ కేన్సర్‌లో ఒక రకం. అందులో Acute lymphoblastic leukemia అనే తరహా వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

 

తెల్లరక్తకణాలని మార్చేసి

ALL బారిన పడ్డ రోగులలో తెల్లరక్తకణాలు దెబ్బతింటాయి. దీని వలన మనిషిలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. తరచూ ఏదో ఒక ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం పెరిగిపోతుంది. ఉపయోగం లేని తెల్లరక్తకణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రక్తహీనత, నీరసం, రక్తస్రావం, జ్వరంలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

 

పిల్లలలో అధికం

ALL బ్లడ్‌ కేన్సర్‌ పిల్లలలో ఎక్కువ. లుకేమియా బారిన పడ్డ ప్రతి నలుగురు పిల్లలలోనూ ముగ్గురిలో ALL తరహా లుకేమియానే కనిపిస్తుంటుంది. అదృష్టవశాత్తూ 95 శాతం మందిలో కీమోథెరపీ మొదలుపెట్టిన నెలరోజులలోపే ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. అయితే వీరిలో దాదాపు 20 శాతం సందర్భాలలో వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. కానీ ఉపవాసం ద్వారా ALLని సమూలంగా నాశనం చేసే అవకాశం ఉందేమో పరిశీలించేందుకు కొన్ని ఎలుకల మీద ప్రయోగం చేశారు పరిశోధకులు.
ఫలితం కనిపించింది

 

ప్రయోగంలో భాగంగా ఎలుకలలో ALL కేన్సర్‌ కణాలను ఎక్కించారు.  ఆ తరువాత ఒకరోజు ఉపవాసం మరుసటి రోజు ఆహారం... ఇలా ఎలుకలతో ఉపవాసం చేయించారు. ఒక ఏడు వారాలు గడిచేసరికి ఉపవాసం చేసిన ఎలుకలలోని కేన్సర్‌ కణాలు కూడా ఆరోగ్యవంతమైన కణాలలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. ఈ ఎలుకల మూలుగు (bone marrow)లో కానీ ప్లీహం (spleen)లో కానీ లుకేమియాని కలిగించే కణాలే కనిపించలేదు.

 

ప్రయోగం తరువాత కొద్దిరోజులకే ఉపవాసం చేయించని ఎలుకలు చనిపోగా, ఉపవాసంతో కేన్సర్‌ను జయించిన ఎలుకలు సుదీర్ఘకాలం జీవించాయి. మన ఆకలిని నియంత్రించి, రక్తప్రసరణ మీద ప్రభావం చూపే leptin అనే హార్మోను మీద ప్రభావం చూపడం వల్లే ఉపవాసం సత్ఫలితాలనిచ్చింది అంటున్నారు పరిశోధకులు. అయితే పెద్దలకు సోకే AML అనే తరహా లుకేమియాలో ఇలాంటి ప్రభావం కనిపించకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ఉపవాసం వల్ల కేన్సర్‌ సైతం నయమవుతుందని తేలిపోయింది. ఉపవాసం వల్ల ఇంకెన్ని రోగాలలో ఉపశమనం లభిస్తుందో తేలడమే తరువాయి. పెద్దలు చెప్పే ఇలాంటి ఆరోగ్య సూత్రాల వెనుక ఎంత ఉపయోగం ఉందో తెలిపే ఇలాంటి పరిశోధనలు ప్రాచీన వైద్యం పట్ల సరికొత్త విశ్వాసాన్ని అందిస్తున్నాయి.

 

 

- నిర్జర.

By
en-us Political News

  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.