Publish Date:Jun 20, 2026
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండిచా క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం (జూన్ 20) చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు బ్యాటింగ్ ప్రారంభించకుండానే ఐదు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది పిచ్‌పై డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో అంపైర్లు పెనాల్టీ రూపంలో భారత్‌కు ఐదు అదనపు పరుగులు కేటాయించారు. దీనివల్ల భారత ఇన్నింగ్స్ 5/0 స్కోరుతో మొదలైంది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్‌పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఈ విధ్వంసకర ఆరంభాన్ని భారత ఓపెనర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో కేవలం 28.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.అంతే కాకుండా చెన్నై చిదంబరం స్టేడియంలో ఐదు వికెట్లు తీసిన తొలి ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. ప్రసిద్ధ్ ధాటికి 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆప్ఘన్ జట్టును ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆదుకున్నాడు. కెప్టేన్స్ ఇన్నింగ్స్ ఆడిన . హష్మతుల్లా షాహిది 102 పరుగులు చేశాడు. ఇది హష్మతుల్లా షాహిది కెరీర్‌లో తన తొలి వన్డే సెంచరీ. అతనికి తోడుగా ఒమర్జాయ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆప్ఘనిస్థాన్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/team-india-clean-sweep-oneday-series-with-afghanm-ysshaswi-36-223657.html
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సరికొత్త ముందడుగు వేశారు.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు.
అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించి, వారి నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు చేతులెత్తేసిన
బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు నిజానిజాలను నిరూపించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
విజయవాడ సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టిన కారు..!
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.