అన్నా క్షమించు.. తప్పు చేశా! కేసీఆర్ కు ఈటల లేఖ..? 

Publish Date:Jun 25, 2021

Advertisement

ఇటీవలే కేసీఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాసినట్టుగా ఉన్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చేసింది తప్పేనని, సమావేశాలు జరిపింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన లీడర్లు కూడా హాజరుకావడం నిజమేనని లేఖలో ఈటల ఒప్పుకున్నట్లుగా ఉంది. తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు.  మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, మీరు నా వేలు పట్టుకుని నడిపించారని కూడా కేసీఆర్‌ను ఈటల కీర్తించారు. 

కేసీఆర్ కు ఈటల రాసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖలో ఏముందంటే..

‘టీఆర్ఎస్ పార్టీలో గత 20 ఏళ్లుగా మీతో సాన్నిహిత్యం చాలా గొప్పది. మీతో కలిసి పని చేసిన ప్రతిక్షణం నేను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నాను. మీరు పార్టీలో నాకు స్థాయికి మించి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరిచ్చిన అవకాశంతో నేను హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా నాకు అదే పెద్ద పదవని అనుకున్నాను. కానీ  ఆ సమయంలో ఎందరో మీతో సన్నిహితంగా ఉన్నా.. వాళ్ళని కాదని నాకు ఏకంగా మన పార్టీ టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను. ఉద్యమ సమయంలో నన్ను వేలు పట్టి నడిపించారు. నన్ను గత ఇరవై ఏళ్ళ నుండి మీ తమ్ముడిలాగా భావిస్తూ వస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకుంటే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు. నాకు రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చారు’ 

‘కానీ నిన్నటి నుండి జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నిన్న నాపై ఆరోపణలతో కొన్ని చానెళ్ళలో వార్తలు రావడం నన్ను తీవ్రంగా కలచివేసింది. నేను చేసిన కొన్ని పనులు తప్పే కావచ్చు. కానీ ఆ పనులు నేను కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడం వల్ల చేయాల్సి వచ్చింది. కానీ పార్టీ మీద కానీ, మీ మీద కానీ నాకు ఎల్లప్పుడూ అపారమైన గౌరవం ఉంది. బెంగుళూర్ లో కానీ, పుణేలో కానీ ఇతర చోట్ల నేను పెట్టిన సమావేశం కూడా కొందరి తప్పుడు మాటలతో నేను ముందుకు వెళ్లాల్సి వచ్చింది తప్పితే నాకు వేరే ఇతర ఆలోచన లేదు. అలా సమావేశాలు పెట్టడం, పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొన్ని రకాల పనులు చేయటం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను మరోసారి పెద్ద మనసుతో మీ తమ్ముడిలా భావించి ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వగలరు. జరిగిన వాటి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తూ మీరు నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇక నుండి అలాంటి తప్పులను కానీ, పార్టీకి ఇబ్బంది కలిగించేలా ఎలాంటి పనులు చేయనని మీకు మాట ఇస్తున్నాను’ అని తెలిపారు.

‘నాతో పాటు పార్టీకి ఇబ్బంది కలిగించే అట్టి సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు కానీ, ఇతర జిల్లాల నాయకులను కూడా పార్టీకు విధేయంగా పనిచేసేలా చూస్తాను. మీరు నా తప్పులను సరిదిద్దుకోవటానికి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా పార్టీను మరింత బలోపేతం చేయటానికి నేను అనుక్షణం సిద్ధంగా ఉంటాను. ఇదే విషయం నేను రామ్ తో అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను. ఆనాడు చెప్పిన దానికే ముమ్మాటికీ కట్టుబడి ఉంటాను’ 

ఇదీ మొత్తంగా ఈటల రాజేందర్ లేఖ సారాంశం. అయితే ఈ లెటర్‌లో మాత్రం తేదీ రాయలేదు. ఇది ముఖ్యమంత్రికి ఈటల రాసిన  లేఖ కావాలనే లీక్ చేశారా? లేక క్రియేట్ చేశారా? అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.