Publish Date:Jul 21, 2025
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నాయకుడు.. ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నట్టుగా వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఆ పార్టీ పేరు బహుజన జనతాసమితిగా పలువురు సోషల్ మీడియాలో పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టడం, దాని పేరు బహుజన జనతా సమితి (బీజెఎస్ గా పలువురుు ధృవీకరణలు కూడా చేసేస్తున్నారు. ఈటల ప్రస్తతం ఉన్న బీజేపీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ రెంటినీ స్ఫురింప చేసేలా బీజెఎస్ అనే పేరును ఈటల ఫిక్స్ చేసినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికే బీసీల ఓటు బ్యాంకు కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒక పక్క అధికార కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే.. ఈ ఆర్డినెన్స్ బహు బాగున్నదంటూ బీఆర్ఎస్ తిరుగుబాటు నేత కల్వకుంట్ల కవిత కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అసలు బీసీలకూ నీకూ ఏం సంబంధం? నీకూ బీసీలకు కంచం పొత్తా- మంచం పొత్తా అంటూ మల్లన్న స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంటే.. ఈటల నేతృత్వంలో మరో కొత్త బీసీల వేదిక తయారైందంటూసమాచారం.
అచ్చం వైసీపీలా సన్నిహితుల పేరిట ఈ బీజెఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అందుకే ప్రతి వార్డు మెంబరూ మనవాళ్లే అంటూ మెసేజ్ లు పంపుతున్నట్టు చెబుతున్నారు. అయితే ఈటల వర్గం మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నాయి. అయితే ఈటల అభిమానుల నుంచి అయితే కొత్త పార్టీ పెట్టాల్సిందే అన్న ఒత్తిడి వస్తున్నట్టు స్వయానా ఈటల వర్గమే చెబుతోంది. ఒక వేళ ఈటల పార్టీ పెడితే లాభనష్టాల బేరీజు ఎలాంటిది? కులాల ఈక్వేషన్లను కలుపుకుపోవడం ఎలా? బహుజన శబ్ధం తో పార్టీ పెడితే ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? అన్న విషయంపై ఈటల టీమ్ సీరియస్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఈ పార్టీ పుట్టుక- మనుగడ- రాణింపు అనే అనే అనుమానాలు, సందేహాలను ఈటల ఎలా నివృత్తి చేస్తారో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/etala-new-party-bjs-39-202377.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.