అనర్హుల ఏరివేత తథ్యం.. కాంగ్రెస్ గ్యారంటీలపై కర్నాటక సీఎం డీకే

Publish Date:Jun 10, 2026

Advertisement

కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న   గ్యారెంటీ పథకాలపై ఉపముఖ్యమంత్రి  డీకే శివకుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ఉద్దేశం  ప్రభుత్వానికి ఇసుమంతైనా లేదని స్పష్టం చేస్తూనే.. అనర్హుల ఏరివేత తథ్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాల ప్రయోజనాలు సజావుగా అందాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియను  చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ నిధులను ఆదా చేయడం కంటే..  క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని డీకే స్పష్టం చేశారు. 

సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో  ఇప్పటికీ   డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు.  మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ  వెరిఫికేషన్ అని వివరించారు. 

 అలాగే.. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకంలో  కూడా దుర్వినియోగం జరుగుతోందనీ,  కొందరు   ఉచిత విద్యుత్‌ను ఇళ్లకు కాకుండా దుకాణాలు, వ్యాపార సముదాయాల వంటి వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారనీ చెప్పిన ఆయన..  ఒకే వ్యక్తి పేరు మీద ఏకంగా 6 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు తనిఖీల్లో తేలిందనీ.. ఇలాంటి అనర్హుల ఏరివేత కోసమే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ తనిఖీల వల్ల అర్హులకు ఎలాంటి నష్టం జరగదని, కేవలం వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశమని డీకే చెప్పారు.  

By
en-us Political News

  
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.