హర్మూజ్ జల సంధి వద్ద అమెరికా దాడుల్లో ముగ్గురు భారత నావికులు మృతి
Publish Date:Jun 11, 2026
Advertisement
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఒమన్ తీరంలోని హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైనిక బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులుప్రాణాలు కోల్పోయారు. తొలుత వీరు గల్లంతైనట్లు భావించినప్పటికీ.. వారు మరణించినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ అధికారికంగా ధృవీకరించారు. పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి. ఈ దాడిలో నౌక పూర్తిగా దెబ్బతింది. నౌకలోని 24 మంది భారతీయులలో 21 మందిని ఒమన్ అధికారుల సహాయంతో సురక్షితంగా రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. తాజాగా ఆ ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
http://www.teluguone.com/news/content/three-indian-sailors-killed-in-us-attacks-36-222601.html





