మహోగ్రరూపం దాల్చిన తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం సందర్శన నిలిపివేత.!

Publish Date:Jul 29, 2026

Advertisement

తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన  బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లాలోని ఈ బొగత జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో  ఆకట్టుకునే ఈ బొగత జలపాతం ప్రస్తుతం ఒకే సమయంలో అద్భుత ప్రకృతి అందం, జల ప్రళయాన్ని తలపింపచేసే  ఉగ్రరూపంతో భయపెడుతోంది. 

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పుడు   అధికారులకు  సవాలుగా మారింది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు ప్రతిరోజూ బొగత జలపాతాలను తిలకించడానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా అధికారులు పర్యాటకులను అనుమతించడంలేదు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో గ  దట్టమైన అటవీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భాకీగా నీరు బొగత జలపాతంలోకి  చేరడంతో బొగత వద్ద నీటిమట్టం   ప్రమాదకర స్థాయికి పెరిగింది. సాధారణంగా ప్రశాంతంగా, సుందరంగా కనిపించే ఈ తెలంగాణ నయాగరా ఇప్పుడు  నీటి ప్రవాహంతో హోరెత్తుతోంది. నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే, చాలా దూరంలో ఉన్నవారికి కూడా ఆ శబ్దం ఎంతో స్పష్టంగా  వినిపిస్తోంది.

ఈ భారీ ప్రవాహం వల్ల జలపాతం పరిసరాల్లో ఉన్న  రాళ్లు జారే ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన అధికారులు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని  బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు  ప్రకటన విడుదల చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అటవీ  సిబ్బంది, పోలీసులు కలిసి జలపాతం వద్ద భద్రతను   పెంచారు. ఎవరూ నీటి వద్దకు వెళ్లకుండా దారి పొడవునా  బారికేడ్లను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా పర్యాటకులను హెచ్చరిస్తూ వెనక్కి పంపుతున్నారు. 

Bogatha Waterfalls,  Mulugu Heavy Rains, Bogatha Floods, Wazeedu Cheekupally, Bogatha Entry Closed

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.