Publish Date:Aug 22, 2025
ఫాల్కన్ స్కామ్ లో తవ్వినకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరిట కంపెనీ పెట్టి ఇన్‌వాయస్ డిస్కౌంటింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న, మధ్య తరగతి మదుపరులను నమ్మించి రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులోలో చార్టర్డ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
లేని డబ్బుల్ని అకౌంట్లో ఉన్నట్లుగా చూపి తప్పుడు లెక్కలతో చార్టెడ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఈ ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్ధీప్ మాత్రం దుబాయ్ కు పరారయ్యాడు. అయితే అమర్ దీప్ కు సహకారం, సహాయం అందించిన శరత్ చంద్ర ఈ స్కామ్ లో కేంద్ర బిందువు అని ఈడీ తేల్చి అరెస్టు చేసింది. హవాలా రూపంలో స్కాం సొమ్ములను విదేశాలకు తరలించడంలో శరత్ చంద్రదేకీకల పాత్ర ధాని అని ఈడీ దర్యాప్తులో తేలింది. పూర్తిస్థాయిలో సహాయం చేసిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్చంద్ర ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్నారని ఈడీ తేల్చింది.. హవాల రూపంలో డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడి దర్యాప్తులో తేలింది. దీంతో చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేసి. ప్రవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడి దారులను .ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, మోసం చేసి ఏకంగా 792 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది.
ఈ స్కామ్‌కి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ యజమాని అమర్‌దీప్ కుమార్ కోసం శరత్ చంద్ర టోష్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు.. మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించినట్టు ఈడీ విచారణలో తేలింది. శరత్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీల్లో వాటాలు కూడా కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో రూ. 18.14 కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది. చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ ను స్వదేశానికి రప్పించడం కోసం ఈడీ ప్రయత్నాలు ప్రారంభించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-arrest-charted-accountant-sarthchandra-39-204743.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.