Publish Date:Aug 11, 2025
తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారికంగా ఖండించింది. తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలూ ఇలా ఉన్నాయి..
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో ఒక్కటి వినా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించినా, కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణను ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఏడింటిలో మెజారిటీ సాధించిందన్నది అవాస్తవం. ఆ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీతో లోక్ సభ స్థానాన్ని గెలుచిందనడం పూర్తిగా అవాస్తవం అని ఈసీ పేర్కొంది.
అదే విధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఏకంగా మూడు రాష్ట్రాలలో ఓటర్ ఐడీ ఉంది. ఆ మూడు రాష్ట్రాలూ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక. ఈ మూడు రాష్ట్రాలలోనూ శ్రీవాస్తవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకే వేశారంటూ ఉదాహరణగా చూపారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వంద్వంగా ఖండించింది. శ్రీవాస్తవ అనే వ్యక్తి మూడు రాష్ట్రాలలోనూ ఓటు వేశారనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవస్తవ అనే వ్యక్తి బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాస్తవక 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివశించారనీ, ప్రస్తుతం కర్నాటకలో ఉంటున్నారనీ పేర్కొన్న ఈసీ.. ప్రతి సారీ కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడీని మార్చుకున్నారని, ఒకే సారి మూడు రాష్ట్రాలలో ఓటు వేయలేదనీ ఈసీ విస్పష్టంగా తేల్చేసింది.
ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది. వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే సత్రాలుఆ చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే చావళ్లు. అంటే సత్రాలలాంటివన్న మాట. అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు తాత్కాలికంగా వచ్చి ఉంటారు. తర్వాత అక్కడ నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకుని ఓటరు ఐడిలు పొందారు కానీ అక్కడ వారు నివసించడంలేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయని ఈసీ నిలదీస్తోంది. అంతే కాకుండా వారంతా బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తోంది. మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన, ఉద్యమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ec-condemn-rahul-gandhi-allegation-on-vote-theft-39-203999.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.