Publish Date:Aug 11, 2025
సింధూనది పై ప్రాజెక్టు కడితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్నటికి మొన్న ఇదే అణు బాంబుల విషయంలో భారీ ఎత్తున భయపడబట్టే కదా? కాళ్లు పట్టుకుని మరీ ఇండియాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది? ఈ విషయం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరచిపోతే ఎలా? మొన్నటి యుద్ధంలో భారత్ పాక్ ని భయపెట్టకుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వలున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది. జస్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్రహ్మోస్ లు వదిలినందుకే తల్లడిల్లిపోయింది పాక్. ఈ ఎయిర్ బేస్ కి దగ్గర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్ తో పాటు అటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్కడ భారత్ బాంబులు పడ్డంతనే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్.. జడుసుకుని బంకర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మళ్లీ బీరాలు పలుకుతున్నాడు.
సింధూనది మీద ప్రాజెక్టు కడుతున్నందుకే ఇలా అంటుంటే మరి బ్రహ్మపుత్రా నది మీద చైనా కడుతున్న ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? సింధూనది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మరి చైనాపై కూడా భారత్ అణు బాంబులు వేయాలా? మొన్న పహెల్గాం దాడి తర్వాత ఇదే సింధూజలాల విషయం వెలుగులోకి వస్తే మేం అణుబాంబులు వేస్తామని అన్నారు పాక్ దేశ నాయకులు. తీరా భారత్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయడం మానేసి.. బంకర్లలో దాక్కున్నారు.
ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే.. ప్రపంచానికే అతి పెద్ద విపత్తుగా భావించిన అమెరికా.. పాక్ విషయంలో ఎందుకో వెనకడుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భారత్ ని భయపెట్టి ఆయుధాలు కొనిపించాలన్న యోచన అమెరికాది. అందుకే ఆ దేశ గడ్డపై నుంచి ఇలాంటి బీరాలు పలికిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువడుతున్నాయ్. మేం పోతే సగం ప్రపంచాన్ని లాక్కెళ్లిపోతామని మీరు భయపెడతారేమో.. కానీ భారత్ మొన్నటిలా చేసి చూపిస్తుంది. అయినా యుద్ధం జరుగుతుంటే మన దగ్గర ప్లాన్స్ లేవు ప్రేయర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భారత్ ను భయపెట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాకట్టి పెట్టి బతుకుతున్న మునీర్ సైన్యాధ్యక్షుడంటే ఆసియాకే అవమాన కరంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/are-pakistan--nuclear-bombs-just-to-scare-39-204001.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!