వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఇద్ద‌రు ఐపీఎస్ ల‌పై ఈసీ బ‌దిలీ వేటు

Publish Date:Apr 23, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై  ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని,  ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది. వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురేసి   పేర్ల‌తో కూడిన ప్యానెల్‌ను బుధ‌వారం (ఏప్రిల్ 24) మ‌ధ్యాహ్నం 3గంట‌ల లోపు పంపించాల‌ని, అధికారుల వార్షిక ప‌నితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాల‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. గ‌తంలోనూ ఆరుగురు అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌లు  వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం.. ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌లపై ఈసీ గతంలోనే బదిలీ వేటు వేసింది.  తాజాగా మ‌రో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటువేసి వైసీపీకి షాకిచ్చింది.

 ఏపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీస్ వ్య‌వ‌స్థ‌తో పాటు ప‌లువురు అధికారుల‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా మార్చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్‌.. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని వైసీపీ వ్య‌తిరేకుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డంతోపాటు ప‌లువురిని పోలీస్ స్టేష‌న్‌ల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై గొంతెత్తిన వారిపై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ఐదేళ్ల‌పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరాచ‌కాల‌ను భ‌రించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రాగానే ఊపిరిపీల్చుకున్నారు. అయినా  ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కోడ్ ను లెక్క చేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌, తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌లు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీకి ఫిర్యాదులు చేయ‌డంతో.. ఈసీ ఫిర్యాదుల‌పై క్షేత్ర‌స్థాయిలో నిజానిజాల‌ను నిగ్గుతేల్చుకొని ఐపీఎస్‌, ఐఏఎస్‌ల‌పై బ‌దిలీ వేటు వేసింది.   కొద్దిరోజుల క్రితం తొమ్మిదిపై బ‌దిలీ వేటు ప‌డ‌గా.. తాజాగా ఇంటెలీజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది.  

ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాల‌పై విప‌క్ష నేత‌లు ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. బ‌స్సు యాత్ర విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్ న‌గ‌ర్ ప్రాంతంకు చేరుకోగానే రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ దాడిలో సీఎం జ‌గ‌న్ కంటి పైభాగంలో గాయ‌మైంది. రాయిదాడి ఘ‌ట‌నకు పోలీసుల‌తోపాటు ఇంటెలిజెన్స్  విభాగం వైఫ‌ల్యం కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీపీ కాంతిరాణా నుంచి నివేదికను అందుకుంది. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యంతో పాటు ఇంటెలిజెన్సీ విభాగం వైఫ‌ల్యం కూడా కార‌ణ‌మ‌ని ఈసీ నిర్దార‌ణ‌కు వ‌చ్చింది. దీనికితోడు ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాలు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. చిల‌క‌లూరి పేట ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల్గొన్న‌ స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌తో పాటు, ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు పెట్టి కార్య‌క‌ర్త‌లు స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టార‌ని, చాలా మంది విప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌కు కూడా ఆయ‌నే బాధ్యులుగా ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశాయి. సీఎం జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఈసీ.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా  ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విచార‌ణ చేసింది. ఈ విచార‌ణ‌లో ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీపై ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో వారిద్ద‌రిపై ఈసీ బ‌దిలీ వేటువేసింది.
 
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిలదే తరువాతి వంతు అన్న చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వారిద్దరినీ  ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని అంటున్నారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డి తొలినుంచీ జగన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారనీ,  ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనీ చెబుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని.. ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు సీఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. పోలీస్‌ బాస్‌ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిపైనా బదిలీ వేటుకు ఈసీ రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత‌కూడా వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. అక్క‌డ నుంచి  ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎస్‌, డీజీపీపై వేటు పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల కోడ్ స‌మ‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ప‌నిచేస్తున్న ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీ కొరడాఝుళిపిస్తోంది. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.