ఇండోనేషియాలో భారీ భూకంపం
Publish Date:Jul 14, 2025
Advertisement
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే.. సునామీ వచ్చే అవకాశం లేదని ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఈ భూకంపకేంద్రం భూమికి 98 కిలో మీటర్లు అంటే 60.89 మైళ్ళు లోతులో ఉందని తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ భూకంపం 6.7 తీవ్రతతో, 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో నమోదైందని నివేదించింది. తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో ప్రకంపనలు సంభవించాయని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ భూకంపంలో నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు రాలేదని డిసాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న మండలం. ఇక్కడ భూమి.. క్రస్ట్‌లోని వివిధ ప్లేట్లు కలుస్తాయి. కాబట్టి, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/earth-quake-in-indonesia-39-201966.html





