బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాతనదైన రాజకీయం చేయడంలో ఆరితేరిన వారన్న పేరుంది ఆయనకు. విజయనగరం రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుల్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివిధ కార్యక్రమాల పేరిట బొత్స అనూష ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చూపిస్తున్న చొరవ చూస్తుంటే అతి త్వరలోనే ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నది.
చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్ గావున్న అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావల్సిన వైద్య సలహాలను అందిస్తున్నారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడికి వెళ్లి తనదైన శైలిలో స్పందిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్పుకుంటోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకుంటున్నట్టు రేపు పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతల్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మరో రాజకీయ వారసత్వం ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/botsa-satyanarayana-daughter-political-entry-39-210713.html
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.