లేఆఫ్‌లతో ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్న అమెజాన్
Publish Date:Mar 5, 2026
Advertisement
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై వేటు పడింది. సుమారు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులపై ప్రభావం పడినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పట్లోనే సంకేతాలు ఇచ్చింది. అందులోభాగంగానే ఇప్పుడు తాజా లేఆఫ్‌లు చేపట్టింది. ఇందులో భాగంగా అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేసేందుకు రోబోలను డిజైన్ చేసే టీమ్‌పై వేటు పడింది. కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు తమ టీమ్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామని అమెజాన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఎంతమందిని తొలగించిందీ పేర్కొనకుండా లేఆఫ్‌లను ధ్రువీకరించింది. వేర్‌హౌస్‌లో కార్మికులకు సాయపడేందుకు రోబోటిక్ విభాగమైన బ్లూ జే.. గతేడాది అక్టోబర్‌లో రోబోలను ప్రదర్శించింది. అయితే, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ ఏడాది జనవరిలో వీటి తయారీని నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల కోతలను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం, ఖర్చుల తగ్గింపులో భాగంగా గతేడాది అక్టోబర్‌లో 14వేల మందిని, ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది కలిపి ఇప్పటికే 30 వేల మంది ఉద్యోగులను అమెజాన్ పక్కనపెట్టింది.
http://www.teluguone.com/news/content/ecommerce-giant-amazon-36-215063.html





