తమిళనాడు డీవీఏసీ డైరక్టర్ పై బదలీ వేటు.!

Publish Date:Jul 14, 2026

Advertisement

 

తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్‌ అరుణ్ పై విజయ్ సర్కార్ వేటు వేసింది. డీవీఏసీ డైరెక్టర్ గా  బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ. అరుణ్‌పై కే  బదిలీ వేటు పడింది.  తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో  టీవీకే విజయం సాధించి విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఎ. అరుణ్‌ను   డీవీఏసీ చీఫ్‌గా నియమితులయ్యారు.  అయితే..  ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన అరుణ్ నియామకం  తొలి నుంచీ   వివాదంగానే మారింది.

గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో అప్పటి అధికార పక్షమైన డీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో  టీవీకే సహా పలు ఇతర రాజకీయ పార్టీలు ఆయన   వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా అరుణ్ పరిపాలనాపరమైన వివక్ష  చూపించారనే ఫిర్యాదులు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను పక్కన పెట్టింది. అలాంటి వివాదాస్పద అధికారిని ఏకంగా అవినీతి నిరోధక శాఖాధిపతిగా అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంపై విజయ్ సర్కార్ పై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అరుణ్ నియామకంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అరుణ్ నియమకంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హఐకోర్టు..  అవినీతిని నిరోధించే ఒక కీలక వ్యవస్థకు అధిపతిగా ఉండే వ్యక్తికి సచ్ఛీలమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది.  

కోర్టు ఇచ్చిన ఈ తీవ్రమైన మొట్టికాయలు, చుట్టుముట్టిన న్యాయపరమైన ఒత్తిళ్లు మరియు ప్రతిపక్షాల నుండి వస్తున్న తీవ్రమైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి విజయ్ ఈ   నిర్ణయాన్ని తీసుకున్నారు. అడిషనల్ చీఫ్ సెక్రటరీ కె. మణివాసన్ జారీ చేసిన  ఉత్తర్వుల ప్రకారం, ఎ. అరుణ్‌ను డీవీఏసీ చీఫ్ బాధ్యతల నుండి బదిలీ చేసి, చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పంపించారు.

ఆయన స్థానంలో ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ర్యాంక్ అధికారిణి సి. మహేశ్వరి ఐపీఎస్‌ను డీవీఏసీ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నూతన చీఫ్‌గా నియమించారు. కేవలం 60 రోజుల్లోనే ఒక పవర్‌ఫుల్ విభాగం హెడ్ బదిలీ కావడం విజయ్ ప్రభుత్వ పాలనా శైలికి,  కోర్టుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Vijay Government Tamil Nadu, C Maheswari IPS, Madras High Court Verdict, Tamil Nadu Bureaucracy, IPS Transfer News

By
en-us Political News

  
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
టాటా క్యాపిటల్ రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో 88.6% మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అధికారికంగా గోల్డ్ లోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భారీ డీల్ వివరాలు మరియు పసిడి రుణాల మార్కెట్ వృద్ధి గణాంకాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ డచ్ ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ 38 కన్నుమూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారుల జాబితా నుండి తొలగించిన కొద్ది వారాలకే జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.