హర్మూజ్ లో ఇరాన్ దాడులు.. ఇండియన్ మృతి.!

Publish Date:Jul 14, 2026

Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా హర్మూజ్ ఒక యుద్ధ భూమిగా మారింది. హర్మూజ్ జలసంధిలో  ఇరాన్ జరిపిన  క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.  యూఏఈ కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన దాడిలో  ఒక మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులలో ఆరుగురు ఇండియన్స్ కాగా, ఇద్దరు  ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. కాగా ఈ దాడి పట్ల ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  

ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలో మొంబాసా ,  అల్ బహియా అనే రెండు యూఏఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ  దాడిని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.   ఈ  దాడికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని  హెచ్చరించింది.ఈ క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాన్‌పై వైమానిక దాడులను  ఉధృతం చేశాయి. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా దెబ్బతీసేందుకు తాము సరికొత్త ఆపరేషన్ ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

 హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుని, దిగ్బంధాన్ని కఠినతరం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.  హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతను అమెరికా చూసుకుంటున్నందున, దానికి ప్రతిఫలంగా ఆయా నౌకల నుంచి  ప్రొటెక్షన్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పారు.ఈ  ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై చూపింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర7.8శాతం పెరిగి.. బ్యారెల్‌కు 81.92 డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. 

Iran missile attack Hormuz, UAE oil tankers attacked, Indian crew member killed, US Iran tensions 2026, Brent crude oil price hike, Strait of Hormuz blockade

By
en-us Political News

  
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ మానవతా పరామర్శను రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని తీవ్ర విమర్శలు అనారోగ్యంతో ఉన్న ఒక చిన్నపిల్లాడిని చూడటానికి వెళ్లడాన్ని కూడా రాజకీయ కోణంలో వక్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడారు. స్వతహాగా పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించే నిరంజన్, టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన పేర్ని నాని వ్యాఖ్యల వీడియోలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
పాతబస్తీకి చెందిన రెండు కుటుంబాలు లులు మాల్ సెల్లార్ పార్కిం గ్‌లో ఒక్కసారిగా వాగ్వాదా నికి దిగారు. గొడవ తీవ్రరూ పం దాల్చుతున్నట్లు గుర్తిం చిన మాల్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందిన సిద్ధిఖీ అనే వ్యక్తి జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
టాటా క్యాపిటల్ రూ.318 కోట్లతో యోగ్‌లోన్స్‌లో 88.6% మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అధికారికంగా గోల్డ్ లోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ భారీ డీల్ వివరాలు మరియు పసిడి రుణాల మార్కెట్ వృద్ధి గణాంకాలు ఇక్కడ చూడండి.
ప్రముఖ డచ్ ఫుట్‌బాల్ రెఫరీ రాబ్ డీపెరింక్ 38 కన్నుమూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారుల జాబితా నుండి తొలగించిన కొద్ది వారాలకే జరిగిన ఈ విషాద సంఘటన వివరాలు మీకోసం.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత గడ్డపై విదేశీ లీగ్ మ్యాచ్! క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన BBL 2026 27 పూర్తి షెడ్యూల్ విశేషాలు, చెన్నై చేపాక్ స్టేడియంలో జరగబోయే చారిత్రక మ్యాచ్ వివరాలు ఇక్కడ చదవండి.
నేటి 14 జూలై 2026 నిఫ్టీ ప్రిడిక్షన్ మరియు కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిల పూర్తి సాంకేతిక విశ్లేషణ. మార్కెట్ బేరిష్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా.
ప్రముఖ హైరింగ్ టెక్నాలజీ సంస్థ జోబిన్ (Xobin) సరికొత్త ఏఐ ఏజెంట్ నూరా (NURA) ను లాంచ్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో 10 లక్షల రెజ్యూమేలను స్క్రీనింగ్ చేస్తూ, ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ టెక్నాలజీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాలో ద్రవ్యోల్బణం 3.4 శాతానికి చేరడంతో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ సంచలన హెచ్చరికలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా భారీ లాభాలను అందించేందుకు సిద్ధంగా ఉన్న అనంత్ రాజ్, శోభ లిమిటెడ్, మరియు పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎస్సెల్ గ్రూప్ పెట్టుబడుల వివాదంలో కోటక్ మహీంద్రా ఏఎంసీ, నిలేష్ షాలపై సెబీ విధించిన రూ.2.1 కోట్ల జరిమానాను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.