ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురి. వీరిద్దరూ చిత్ర విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మిస్సింగ్ అంటూ దివ్వెల మాధుడు చేస్తున్న హడావుడి మరో కొత్త డ్రామాయా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వేల మాధురి ఎపిసోడ్ లో.. దువ్వాడ అదృశ్యం వార్త కలకలం రేపుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు. అయితే ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో ఎలా మిస్సౌతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దువ్వాడ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. దువ్వాడ మాత్రం అక్కడకు రాలేదు.
దీంతో దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులే రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉంటారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవడో ఊరూ పేరూ లేని వాడు కేసు పెడితే.. ఒక ఎమ్మెల్సీని పోలీసు స్టేషన్ కు పిలుస్తారా? అంటే మండిపడ్డారు. దువ్వాడకు ఏదైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టనంటూ పోలీసులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కొత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
దివ్వెల మాధురి చేస్తున్న ఆరోపణలను కొత్తూరు పోలీసులు తోసిపుచ్చారు. తాము దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయలేదని, అసలు ఆయన పోలీస్ స్టేషన్ కే రాలేదని స్పష్టం చేశారు. దువ్వాడే అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు. ఇక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇక ఈ డ్రామాలో ట్విస్ట్ ఏమిటంటే.. పోలీసు స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ రూటు మార్చి.. ఒడిస్సావైపు వెళ్లడం. ఈ విషయాన్ని పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా సాంకేతికంగా ధృవీకరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/duvvada-goes-missing-while-heading-to-the-police-station-39-224742.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.