హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం
Publish Date:Aug 19, 2025
Advertisement
హైదరాబాదు నగరంలో మరోసారి ఐటీ సోదాలు కొన సాగుతుడడంతో తీవ్ర కలకలం రేపుతుంది. DSR గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపనీ లో ఐటీ సోదాలు నిర్వహిం చారు. DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ ప్రయివేటు లిమిటెడ్ , DSR ఇన్ఫ్రా స్ట్రక్షర్ కంపెనీల్లో మరియు .DSR గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్ ఇళ్లల్లో సోదాలు జరుగు తున్నాయి. సంస్థ సీఈవో సత్యనారాయణరెడ్డి, ఎండీ సుధాకర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకత వకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు కొనసా గిస్తున్నారు.గడిచిన 5ఏళ్ల పన్నుల చెల్లింపు లపై ఐటీ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ తోపాటు నెల్లూరు, చెన్నై, బెంగళూరులో మొత్తం 15చోట్ల సోదాలు కొనసాగించారు. హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ ,SR నగర్ , సురారంలో ఐటీ సోదాలు నిర్వహించారు.హైదరాబాద్ నగరంలోని డిఎస్ఆర్ గ్రూపులో ఈరోజు ఉదయం నుండి ఐటి అధికా రులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇండ్లలో కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.డి ఎస్ ఆర్ గ్రూపు లో రంజిత్ రెడ్డికి భాగస్వామ్య ఉంది. DSR ఎండీ సుధాకర్ రెడ్డితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, అలాగే సీఈఓ సత్య నారాయ ణరెడ్డి ఇళ్లల్లో మరియు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. CRPF బలగాల మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఫిలింనగర్ లో డి ఎస్ ఆర్ భాగస్వామ్యంతో రంజిత్ రెడ్డి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.
http://www.teluguone.com/news/content/dsr-group-39-204543.html





