Publish Date:Oct 24, 2020
ఉప ఎన్నికలు వచ్చాయంటనే ఓటర్లకు డిమాండ్. ఉప ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంటే ఓటర్లకు పండుగే. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు మాత్రం డబుల్ ఫెస్టివల్ వచ్చినట్లైంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు విజయ దశమి రావడంతో దుబ్బాక ఓటర్లకు డబుల్ ధమాకా తగిలినట్లైంది. ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్ల ప్రసన్నం కోసం నానా పాట్లు పడుతున్నాయి. భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు నేతలు. ఇప్పుడు దసరాను ఓట్ల వేటలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని తెలుస్తోంది. పండగ పూట ప్రజలకు భారీగా నజనారాలు, తాయిలాలు ఇస్తున్నారట. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో దసరా జోష్ రెట్టింపైందని చెబుతున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఓటర్ల కోసం పండగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయట ప్రధాన పార్టీలు. మందు, మటన్ ఇంటింటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం భారీగా మేకలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యూహం ప్రకారం పార్టీలు ముందుకెళ్తున్నాయని చెబుతున్నారు. మందు, మటన్ పంపిణి కోసం ప్రతి 100 ఇండ్లకు ఒక ఇన్చార్జిని పెట్టారట. గ్రామాలు, వార్డులు, కులాలు, మహిళా గ్రూపులు, రైతులు, యువజన సంఘాలు.. ఇలా ఎలా సాధ్యమైతే అలా మటన్ పంపిణి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. పండుగ రోజు ప్రతి ఇంటికి లిక్కర్ ను సరఫరా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మద్యం పంపకాల్లో క్యాండిడేట్లు కొత్త పోకడ పోతున్నారట. గ్రూపులు పెట్టి, స్పెషల్టోకెన్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.
దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రలోభాలు జోరుగా నడుస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో ఓటర్లపై వల విసురుతున్నారు. సన్న బియ్యం బస్తాలు, నూనే డబ్బాలు, గోదుమ పిండిలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారట. ఇంటింటికీ కేజీ బాస్మతి బియ్యం ప్యాకెట్లను కొన్ని గ్రామాల్లో ఇచ్చారని చెబుతున్నారు. వెజిటేరియన్స్ కోసం స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలను కూడా సరఫరా చేసినట్లు చెబుతున్నారు. యువకులకైతే ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.
మంది, మటన్ పంపిణిలోనూ పార్టీలు పోటి పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వారు ఇచ్చిన దాని కంటే ఎక్కువే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీలు పోటీ పడి ఇస్తున్న తాయిలాలతో ఖుషీగా ఉన్నారు దుబ్బాక ఓటర్లు. ఉప ఎన్నిక సమయంలో దసరా రావడంతో ఈసారి జబర్దస్తుగా జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఈసారి దసరా డబుల్ జోష్ తో జరుగుతుందని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/double-dhamaka-for-dubbaka-voters-25-105518.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.