అయోధ్య రామమందిరం.. విరాళాల సొమ్ము మాయం?

Publish Date:Jun 25, 2026

Advertisement

అయోధ్యలోని ప్రతిష్ఠాత్మక శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయ విరాళాల లెక్కింపులో చోటుచేసుకున్న   విస్తుపోయే పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. మందిరానికి వచ్చే విరాళాల సొమ్ము మాయమవుతోందనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఉన్నతాధికారి,  ఇద్దరు సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అయితే..  ఈ నిధుల వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,  రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు  హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఒకవైపు సీఎం యోగి ఈ నిధుల గోల్ మాల్ ను అయోధ్య  ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్  నృపేంద్ర మిశ్రా ఇది ముమ్మాటికీ బహిరంగ దోపిడీ అని కుండబద్దలు కొట్టారు. వీరి పరస్పర విరుద్ధ ప్రకటనలు  అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజలలో అయోమయానికి కారణమయ్యాయి. 

ఈ నగదు గోల్ మాల్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందంటే..  లెక్కింపు గదుల వెలుపల ఉన్న ఒక వాష్ రూమ్ లో కొంత నగదు   పడి ఉండటాన్ని అధికారులు గమనించారు. ఎవరో దొంగిలించి బయటకు తరలించలేక  అక్కడ వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని చంపాత్ రాయ్ దృష్టికి తీసుకెళ్లగా..  అక్కడికి చేరుకుని పరిస్థితి  సమీక్షించారు. ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ విచారణ జరిపించాలని సిఫారసు చేశారు.  

 విరాళాల లెక్కింపు ప్రక్రియలో సుమారు 40 నుండి 45 మంది సిబ్బంది పాల్గొంటున్నారని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. అయితే, నిబంధనల ప్రకారం లెక్కింపు గదిలోని సిబ్బంది జేబులు లేని దుస్తులు ధరించాలనే డ్రెస్ కోడ్‌ను పూర్తిగా పక్కనబెట్టారని ఆరోపించారు. సిసిటివి కెమెరాల నిఘా వైఫల్యంపై నృపేంద్ర మిశ్రా   అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో నిఘా వ్యవస్థ,  భద్రత అనేవి దాదాపు శూన్యమని, సీసీటీవీలు సమర్థవంతంగా పనిచేయలేదని  విమర్శించారు. అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే, నిఘా కెమెరాల ఫుటేజీ కేవలం 45 రోజుల్లో ఆటోమేటిక్‌గా డిలీట్  అయిపోతుంది. దీనికి సంబంధించి ఎలాంటి  లేదా బ్యాకప్ వ్యవస్థలు లేకపోవడం వల్ల..  45 రోజుల కంటే ముందు ఏం జరిగిందనేది నిర్ధారించడం సిట్  అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. దీనిని ఒక పద్ధతి ప్రకారం జరిగిన 'ఖులా డాకా' (బహిరంగ దోపిడీ) నృపేంద్ర మిశ్రా అభివర్ణించారు. నిధుల లెక్కింపు,  రక్షణ బాధ్యతలను ఒప్పందం ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పూర్తిస్థాయిలో నిర్వహించాల్సి ఉందనీ, విజిలెన్స్ కోసం  శాశ్వత సిబ్బందిని నియమించడంలో బ్యాంక్ పూర్తిగా విఫలమైందని మిశ్రా ఆరోపించారు.

ఈ వివాదంపై రాజకీయ రచ్చ సాగుతుండగా..  సీఎం యోగి ఆదిత్యనాథ్   దీనిని తీవ్రంగా ఖండించారు.  , ఐదు శతాబ్దాల పోరాటం తర్వాత హిందూ సమాజం ఎంతో పవిత్రంగా సాధించుకున్న రామాలయంపై, అయోధ్యపై ప్రశ్నలు సంధించడం, అనుమానాలు రేకెత్తించడం అయోధ్యను అవమానిం చడమేనన్నారు.   ప్రతిపక్షాలు,  కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రగా ఈ వ్యవహారిన్ని అభివర్ణించడం ద్వారా రాజకీయ లబ్థి కోసం ఆయన చేసిన ప్రకటన మరింత వివాదాస్పదంగా మారింది.  అయితే నృపేంద్ర మిశ్రా మాత్రం ప్రభుత్వం చెబుతున్న గణాంకాలను కూడా తప్పుబట్టారు. గత ఏడాది కాలంలో 16 కోట్ల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అతిశయోక్తిగా ఉన్నాయని, నిజమైన సంఖ్యను మాత్రమే మీడియాకు వెల్లడించాలని   డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంతర్గత విభేదాలు రామ్ మందిర ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయనే ఆందోళన భక్తులలో వ్యక్తమవుతోంది.

By
en-us Political News

  
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు మిస్టరీ
ప్రముఖ కమెడియన్ లారీ డేవిడ్ సరికొత్త అమెరికన్ హిస్టరీ కామెడీ షో లైఫ్, లారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపినెస్ విశేషాలు మరియు దీనిని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
జూలై 4 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026లో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ఐసీఐసీఐ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా మీ షాపింగ్ బడ్జెట్‌ను ఎలా ఆదా చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి!
నిర్మాత కేవీఎన్ నియామకంపై తమిళనాట రాజకీయ దుమారం..
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోనుందా? SBI Caps నివేదిక, రెండో దశ విస్తరణ పనులు, టికెట్ ధరలపై ప్రభావం తదితర పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రిలయన్స్ జియో యూజర్ల కోసం సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్లు! జూన్ 30, 2026 లోపు మైజియో యాప్‌లో పేటీఎం, అమెజాన్ పే, మోబిక్విక్ ద్వారా రీఛార్జ్ చేసి ₹100 వరకు క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూన్ 26 నుంచి 28 వరకు ఈపీఎఫ్ఓ (EPFO) ఆన్‌లైన్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. వెబ్‌సైట్ డౌన్ అయిన సమయంలో మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ సెలవు రోజున మీ బ్యాంక్ ఖాతా నుండి ఎస్‌ఐపీ (SIP) డబ్బులు కట్ అయ్యాయా? ఆందోళన చెందకండి. మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల ప్రకారం మీకు ఎన్ఏవీ (NAV) మరియు యూనిట్ల కేటాయింపు ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.
జూలై 1, 2026 నుండి జపాన్ ప్రభుత్వం గ్లోబల్ వీసా ఫీజులను పెంచుతోంది. ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ పర్యాటకులకు వీసా ధరలు మారతాయా? VFS సర్వీస్ ఛార్జీల వివరాలు మరియు జూన్ 30 లోపు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో మాజీ ఛాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ షాక్ ఇచ్చింది. 2-1 తేడాతో విజయం సాధించి 2006 తర్వాత తొలిసారి నాకౌట్ చేరిన ఈక్వెడార్ సంచలన మ్యాచ్ వివరాలు ఇవే!
టీజీ 20 లీగ్‌లో నల్గొండ నైట్స్ జట్టు 259 పరుగుల భారీ స్కోరుతో వరంగల్ వారియర్స్ జట్టుపై 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నితీశ్ రెడ్డి (81), గౌరవ్ రెడ్డి (80) రన్స్‌తో అద్భుత ప్రదర్శన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ హాకీలో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 1 గోల్స్ తేడాతో ఘోరంగా ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించిన మ్యాచ్ వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.