ట్రంప్ ను ఖతం చేస్తే.. 96 కోట్లు.. ఇరాక్ సాయుధ గ్రూప్ ఫత్వా.!

Publish Date:Jul 17, 2026

Advertisement

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాక్‌కు చెందిన ఒక సాయుధ గ్రూప్ ఫత్వా జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్‌ను ఖతం చేసిన   వారికి  10 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో 96 కోట్ల రూపాయలు నజరానా  ప్రకటించింది.   పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తుండగా..  ఈ తాజా ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రకటన వెనుక ఉన్న కారణాలు, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తో పాటు రష్యా ప్రభుత్వ  మీడియా సంస్థ అయిన ఆర్‌టీ  తమ ప్రత్యేక కథనాల్లో ఇరాక్ సాయుధ గ్రూపు ప్రకటనక అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి.  తమను తాము  ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ గా పేర్కొన్న ఆ సాయుధ సంస్థ ట్రంప్ పై ఫత్వా ప్రకటించింది. ఇందుకు కారణంగా ఐసిస్  ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ మరణించిన తమ కమాండర్ల గురించి గతంలో డొనాల్డ్ ట్రంప్   అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ, తమ నేతలను  కించపరిచినందుకు ప్రతీకారంగానే ట్రంప్ తలపై భారీ నజరానాను ప్రకటిస్తున్నట్లు ఆ   గ్రూప్  పేర్కొంది.

అయితే..  ఈ భారీ రివార్డు సొమ్మును హంతకులకు ఎలా అందజేస్తారు, దీనికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలపై సదరు గ్రూప్ స్పష్టత ఇవ్వలేదు. అదలా ఉంటే..  ఇరాన్ ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎన్ఏ,  రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్‌టీలు ఈ సాయుధ గ్రూప్ చేసిన ప్రకటనను   స్వతంత్రంగా ధ్రువీకరించలేదని తమ కథనాల్లో  పేర్కొన్నాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియా దేశాల్లో,  అమెరికా దౌత్య వర్గాల్లో అలజడి రేపాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో అమెరికా వ్యతిరేకత ఈ ప్రకటనతో  ప్రస్ఫుటమైంది.  

Donald Trump bounty, Iraqi armed group, Trump assassination reward, Islamic Resistance in Iraq, Russia RT news, Trump news Telugu

By
en-us Political News

  
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.