ఓరినాయ‌నో..ట్రంప్‌కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా?

Publish Date:Jun 22, 2025

Advertisement

 

ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి  ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం  ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ క‌లియుగం దాదాపు అంతానికొచ్చేసిన‌ట్టేనా. అంటే అవున‌నే తెలుస్తోంది.మొన్నంటే మొన్న యూఎస్ జ‌న‌ర‌ల్ పాక్ జ‌న‌ర‌ల్ మునీర్‌ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న ఉగ్ర‌వాద నిరోధంలో కీల‌క పాత్ర పోషించార‌న‌డం ఎలాంటిదో.. ఇప్పుడు ట్రంప్ ప్ర‌పంచ యుద్ధ వాతావ‌ర‌ణం కంట్రోల్ చేస్తున్నార‌ని పాక్  కామెంట్ చేయ‌డం కూడా స‌రిగ్గా అలాంటిదేన‌ని అంటారు కొంద‌రు అంత‌ర్జాతీయ దౌత్య వ్యాపారాల నిపుణులు.మునీర్ ఎంత‌టి ఉగ్ర వ్య‌తిరేఖో, ట్రంప్ కూడా అంతటి యుద్ధ వ్య‌తిరేకి, శాంతి  పిపాసిగా చూడాల్సి వ‌స్తుంద‌ని అంటారు వీరంతా. 

కార‌ణ‌మేంటంటే మొన్నంటే మొన్న జీ7 నుంచి వెళ్తూ వెళ్తూ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్  ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. కాల్పుల విర‌మ‌ణ కాదు అంత‌క‌న్నా మించి జ‌ర‌గ‌బోతుంద‌ని అన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ వాసులంతా త‌మ త‌మ ఇళ్ల‌ను వ‌దిలి వెళ్లాల్సిందేన‌ని సూచించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ఇప్ప‌టికే ప‌శ్చిమాశియాకి త‌న యుద్ధ నౌక‌ల‌ను త‌ర‌లించ‌డంతో పాటు భారీ ఎత్తున బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల‌ను త‌ర‌లించ‌మ‌ని ఆదేశించిన వ్య‌క్తికి నోబుల్ శాంతి బ‌హుమ‌తా? ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్దంలో ఉండ‌గానే అరుదైన ఖ‌నిజ నిల్వ‌లు త‌మ‌కు ద‌క్కేలా ఒప్పందాలు చేసుకున్న బేహారి ట్రంప్ కి శాంతి బ‌హుమ‌తా?

తాము 85 కోట్ల రివార్డు ప్ర‌క‌టించిన హ‌ఫీజ్ స‌యీద్.. అక్క‌డ త‌న కొడుకు త‌ల్హాతో స‌హా ఉగ్ర విధ్వంస‌కాండ చేస్తుంటే.. అత‌డికి అత‌డి కొడుక్కీ పాక్ సైన్యం పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తుంటే.. ఉగ్ర‌వాదుల మ‌ర‌ణాల స‌మ‌యంలో సైనికాధికారులు వెళ్లి మ‌రీ వారి మృత‌దేహాల‌కు జాతీయ జెండా క‌ప్పి వ‌స్తుంటే.. సుల్తాన‌న్ బ‌షీరుద్దీన్ అనే ఒక అణు ఉగ్ర‌వాది  కొడుకు ఏకంగా  ఆ దేశ డీజీఐఎస్పీఆర్ గా  సైన్యంలో అత్యంత పెద్ద హోదాలో ఉంటే..  ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉగ్ర అరాచ‌కాల‌కు కేంద్ర‌మై చేతినిండా ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటుకున్న పాక్ ఏమిటీ? అంత‌క‌న్నా  ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటించుకుంటోన్న ట్రంప్ కి నోబుల్ శాంతి బ‌హుమ‌తి కి సిఫార్సు చేయ‌డ‌మేంటి? అది కూడా మునీర్ కి ట్రంప్ విందు ఇచ్చిన మూడు రోజుల త‌ర్వాత పాక్ నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డ‌మేంటి?

అయితే ఇక్క‌డ మునీర్ కే ఇంత ప్ర‌యారిటీ ఏంట‌ని చూస్తే.. డ‌బ‌ల్యూఎల్ఎఫ్ వంటి త‌న  కుటుంబ సంస్థ‌లో పాకిస్తాన్నే  ఏకంగా తాక‌ట్టు పెట్టేందుకు ఆయ‌న ద‌గ్గ‌రుండి ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేయించ‌డం వ‌ల్లే.. ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు ఒక అంచ‌నా. లేకుంటే ఆప‌రేష‌న్ సిందూర్ లో వార్ ప్లాన్స్ లేవు ఓన్లీ ప్రేయ‌ర్సే అని చేతులెత్తేసిన మునీర్ కి.. యూఎస్ ఆర్మీ 250వ పెరెడ్ కి అందుకే పిలిచిన‌ట్టుగా ఒక స‌మాచారం. అంతే కాదు మునీర్ కి పాక్ చ‌రిత్ర‌లోనే  రెండో సారి  ఫీల్డ్ మార్ష‌ల్ హోదా ర‌ప్పించ‌డంలోనూ ట్రంప్ పాత్ర ఉన్న‌ట్టు తెలుస్తోంది. అలాంటి మునీర్ ఏం చేస్తాడు.. భార‌త్ పైకి ఉగ్ర‌వాదుల‌ను ప్రేరేపించేలా కామెంట్లు చేస్తాడు. ఆ త‌ర్వాత వారు.. పహెల్గాం వంటి దాడుల‌కు తెగ‌బ‌డ‌తారు.

ఇక ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున ప్యాకేజీలు పాక్ కి రావ‌డంలోనూ ట్రంప్ పాత్ర బ‌లంగా ఉంది. ఈనిధుల్లోని కొంత మొత్తాల‌ను మ‌సూద్ అజ‌ర్ వంటి  ఉగ్ర‌నాయ‌కుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద ఇస్తుంది  పాక్. మొన్నంటే మొన్న ప‌హెల్గాం సూత్ర‌ధారి క‌సూరీని ఐక్య‌రాజ్య స‌మితి ఉగ్ర‌వాద జాబితాలో చేర్చితే.. అదో గ‌ర్వ‌కార‌ణంగా అత‌డు ప‌బ్లిగ్గా రోడ్ల మీద తిరుగుతూ కామెంట్లు చేస్తుంటే పాక్  పిన్ డ్రాప్ సైలెన్స్. అలాంటి  పాకిస్థాన్ చేసే ప్ర‌తి ఉగ్ర చ‌ర్య‌నూ ఖండించాల్సింది పోయి విందులూ వినోదాలు గౌర‌వాలు ప‌ద‌వులతో పాటు నిధులు ఇప్పిస్తోంది ట్రంప్ స‌ర్కార్. 

ఈ మొత్తం వ్య‌వ‌హారంతో పాటు చైనాకి ప్ర‌స్తుతం ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉన్న  పాక్ ద్వారా ట్రంప్ ప‌రిపాల‌న మ‌రింత‌గా ఏదో ఆశిస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ సంబంధ బాంధ‌వ్యాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డేలా ఈ రెండు దేశాలు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోందని అంచనా వేస్తున్నారు. తొలి ట్రంప్ పాల‌న ఇదే పాకిస్థాన్ కి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మీ దేశంలోని ఉగ్ర‌వాదాన్ని మీరు క‌ట్ట‌డి చేయ‌కుంటే నిధులివ్వ‌మ‌ని ఖ‌రాకండిగా చెప్పారు కూడా. అదే  సెకండ్ ట‌ర్మ్ వ‌చ్చేలోగా.. పాక్ చైనాకు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డంతో.. ఇదిగో దాన్ని బుజ్జగించి.. చైనాను దారికి తెచ్చుకోవ‌డంలో భాగంగా ట్రంప్ ఇటు మునీర్ ద్వారా త‌మ సంస్థ‌ల్లో పాక్ ని ఇన్వాల్వ్ చేయ‌డం.. అటు అత‌డి ద్వారా ఇటు భార‌త్, చైనాల‌కు ఏక కాలంలో చెక్ పెట్టేలా అడుగులు వేయ‌డం వంటివి జ‌రుగుతున్న‌ట్టు భావిస్తున్నారు నిపుణులు.అయితే ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే ఖ‌మైనీ అంత‌మే ధ్యేయంగా సాగుతున్న ఇజ్రాయెల్ కి ఇంత స‌పోర్ట్ చేస్తూ.. ఇదంతా శాంతి కోసం చేస్తున్న  య‌త్న‌మ‌ని.. త‌న‌లాంటి శాంతి  కాముకుల‌కు నోబుల్ శాంతి బ‌హుమ‌తి రాద‌ని ఆయ‌న‌కు ఆయ‌న రివ‌ర్స్ స్టేట్ మెంట్ ఇచ్చుకోవ‌డం ఏదైతే ఉందో.. అది ట్రంప్ కి తెలిసినంత మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలంటారు దౌత్య‌నిపుణులు.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.