వల్లభనేని వంశీకి చావో రేవో!?

Publish Date:Apr 8, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడకు ఆనుకుని ఉండే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై అత్యంత కీలకమైనది. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచీ ఇక్కడ నుంచి పలువురు ప్రభావమంతమైన  నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం వంటి దిగ్గజాలను చట్ట సభకు పంపిన నియోజకవర్గం ఇది. గన్నవరం నియోజకవర్గం నుంచి పుచ్చల పల్లి సుందరయ్య మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికైనా 2009 నుంచి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేం పార్టీకి కంచుకోటగా మారింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి వరుసగా రెండు సార్లు  తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే రెండో సారి విజయం సాధించిన తరువాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరిపోయారు.  దీంతో కొద్ది కాలం పాటు తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో   నాయకత్వ శూన్యత ఏర్పడింది. అయితే గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన  యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి రానున్న ఎన్నికలలో వంశీకి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో యార్లగడ్డకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వీడిన తరువాత వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో ప్రతికూలత పెరిగింది.

ముఖ్యంగా వైసీపీ గూటికి చేరిన వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆయనకు స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు వైసీపీలో కూడా వంశీకి వ్యతిరేకంగా పలువురు గ్రూపు కట్టడంతో ఆ పార్టీలో కూడా ఆయన మాటకు చెల్లుబాటు లేకుండా పోయింది.  ఒక దశలో రాజకీయ సన్యాసం అంటూ సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించిన వంశీ చివరకు గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయినా ఆయనకు వైసీపీ శ్రేణుల నుంచి సంపూర్ణ మద్దతు అయితే లభించడం లేదు. ఇందుకు విరుద్ధంగా  గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు వెంట తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఏకతాటిపై నిలబడింది.  తెలుగుదేశం నుంచి విజయం సాధించి వైసీపీలోకి జంప్ చేసిన వంశీని నియోజకవర్గంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు.

ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. తాను చంద్రబాబు, ఆయన కుటుంబీకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వంశీ బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది.  మరోవైపు యార్లగడ్డకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల నుంచీ మద్దతు కనిపిస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీకి ఈ ఎన్నికలు చావో రేవోగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.