డీఎల్ ఓపెన్ అయిపోయారు.. కూటమికే జై కొట్టారు!

Publish Date:Apr 10, 2024

Advertisement

డీఎల్ రవీంద్రారెడ్డి  కడప జిల్లాకు చెందిన ఈ మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ రాజశేఖరరెడ్డికి సమకాలీనుడైన డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో  ఓ వెలుగు వెలిగారు.  కడప జిల్లాకు చెందిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. వైఎస్సార్ తో విభేదాలున్నా కడప జిల్లాలో  ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంపై గట్టి పట్టు సాధించారు.   

ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న గుర్తింపు ఉన్న డీఎల్ రాయల సీమ సమస్యలపై గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.  వైఎస్ మరణం తరువాత జగన్ ను ఎదుర్కొనే విషయంలో రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీఎల్ పైనే అధారపడింది. రాష్ట్ర విభజన  సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న డీఎల్.. రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  2019 ఎన్నికలలో పోటీ చేయలేదు.  కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో  వైసీపీలో  చేరారు. హైద్రాబాద్ లోటస్ పాండ్ లో ఆయన అప్పట్లో వైఎస్ జగన్ ను  కలిశారు. అంతకు ముందు జగన్ దూతగా సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా రవీంద్రారెడ్డి నివాసానికి వెళ్లి మరీ ఆయనను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన వైసీపీ గూటికి చేరారు.

అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన ఆ పార్టీకి దూరం జరిగారు. అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయకపోయినా పార్టలో క్రియాశీలంగా లేరు. జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేస్తూ వచ్చారు.   సామాజికవర్గ కోణంలో తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలో చేరేలా ప్రోత్సహించారనీ, కానీ తాను వైసీపీలో చేరి ఎంత తప్పు చేశానో తరువాత కానీ అర్ధం కాలేదంటూ డీఎల్ రవీంద్రారెడ్డి ఆ తరువాత పలు సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయనీ,  వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందనీ విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ లక్ష్యంగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలకులు సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా  పనిచేస్తున్నారని, రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదనీ చెబుతూ పరోక్షంగా సజ్జలపైనా విమర్శలు గుప్పించారు.  

అయితే ఆ తరువాత కారణాలేమైనా  సైలెంట్ అయిపోయారు. అయినా మైదుకూరు నియోజకవర్గంలో ఆయన పట్టు ఇసుమంతైనా సడలలేదనే చెప్పాలి. అదును చూసి దెబ్బకొట్టిన చందంగా ఇంత కాలం వైసీపీకే కాదు, అసలు రాజకీయాలకే దూరంగా ఉన్న రవీంద్రారెడ్డి సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు బయటకు వచ్చి తాను తెలుగుదేశం కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎలా చూసుకున్నా ఇది ఇప్పటికే అంతంత మాత్రం గెలుపు అవకాశాలతో ఎదురీదుతున్న వైసీపీకి గట్టి షాక్ అనడంలో సందేహం లేదు. ఆయన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతు ప్రకటించి ఊరుకోకుండా రాష్ట్రంలో రాబోయే సర్కార్ తెలుగుదేశం కూటమిదేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిని గెలిపించాలా? వైఎస్ బిడ్డ షర్మిలను గెలిపించాలా అన్నది నిర్ణయించుకోవలసింది ప్రజలేనన్న డీఎల్ రవీంద్రారెడ్డి.. ఆ నిర్ణయం తీసుకునేముందు మాత్రం వివేకం సినిమా చూడాలని అన్నారు. ఆన్ లైన్ లో విడుదలై సంచలనం సృష్టిస్తున్న వివేకం సినిమాలో వైఎస్ హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా చూపారు. ఆ సినిమా చూసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండంటూ పిలుపు నివ్వడం ద్వారా డీఎల్.. అవినాష్ ను గెలిపించవద్దని ప్రజలకు పరోక్షంగా సూచించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.