ప్రత్యర్థికి డిఎల్ రవీంద్రారెడ్డి మద్దత్తు .. అధికారంలో వచ్చేది ఎన్డీఏ కూటమి అని జోస్యం 

Publish Date:Apr 10, 2024

Advertisement

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎపిలో రాజకీయ సమీకరణాలు చక చకా మారిపోతున్నాయి.ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నాయకులు తమ గళం విప్పుతున్నారు.  కడపజిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట.  ఆ జిల్లా నుంచి చాలామంది   నేతలు  ఉమ్మడి రాష్ల్రంలో చక్రం తిప్పిన వారే .   దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రారెడ్డి కీలక నేతగా పని చేశారు. వైఎస్ ఆర్ మరణం తర్వాత చాలామంది నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. మైదుకూరు నుంచి  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

ముక్కుసూటి తనం ఆయన సొంతం. ఏది మనసులో దాచుకోరు....ఏది అనిపిస్తే అది అనేయడం ఆయన స్టైల్. కేబినేట్ లో ఉండి ముఖ్యమంత్రిని తిట్టిన ఘనుడు బహుశా ఆయనే కావచ్చు..సీఎంపై విమర్శలు చేసి చేసి చివరకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.  మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి  2014 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  
గతంలో టీడీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిది. కానీ డీఎల్ ఎటు వెళ్లలేదు.2014 ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి పోటీ చెయ్యలేదు. కానీ మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్  కు మద్దతు ప్రకటించారు.  అయితే ఆ ఎన్నికల్లో పుట్టా సుధాకర్ యాదవ్ వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎన్నికల అనంతరం పుట్టా సుధాకర్ యాదవ్ తో వచ్చిన విభేధాలతో డీఎల్ రవీంద్రారెడ్డి స్తబ్ధుగా ఉన్నారు.  వాస్తవంగా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాస్త బహీనంగా ఉంది. ఉన్న కొద్దిమంది నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది.  పార్టీలోని సమస్యలను చక్కదిద్దుతూనే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని  మాజీ సీఎం చంద్రబాబు అన్వేషణలో పడ్డారు.  ముఖ్యమంత్రి జగన్ ఇలాకాలో  ఎక్కువ స్థానాలను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అనూహ్యంగా డిఎల్ తెలుగుదేశం పార్టీకి మద్దత్తు వహించడం చంద్రబాబుకు ప్లస్ అయ్యింది. 
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలోని విభేధాలను పక్కనపెట్టి గెలుపుగుర్రాలపై  చంద్రబాబు నాయుడు కాన్ సన్ ట్రేట్ చేయాలని దేశం శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కడపలో వైసీపీకి గండికొట్టాలంటే బలమైన నాయకులను పార్టీలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ప్రకటించిన మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. 
భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందడం....ఆ తర్వాత జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో  ఆ సమయంలోనే డీఎల్ సైకిలెక్కుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కూడా డీఎల్ మౌనంగానే ఉండిపోయారు. 
 ఇకపోతే తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతనే డీఎల్ ఎటూ తేల్చుకోలేకపోయారని టాక్. ఆరుసార్లు మైదుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎల్ అదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించారు.. అయితే టీడీపీ మాత్రం మైదుకూరు నియోజకవర్గం పుట్టా సుధాకర్ యాదవ్ కు కేటాయించింది. ఈ నిర్ణయం డీఎల్ కు రుచించలేదని సమాచారం. 
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డితో తరచూ చర్చలు జరిపారు. 2019లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన డిఎల్ కొంతకాలంగా స్థబ్దుగా ఉంటున్నారు.  డీఎల్ రాజకీయంగా సీనియర్ నేత కావడం వల్ల ఆయన మద్దతిచ్చే అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. 
‘వివేకం’ సినిమా చూశాక ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే అధికారంలోకి వస్తుందని  ఆయన జోస్యం చెప్పారు.  తాను వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్‌రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదని బాహాటంగానే చెబుతున్నారు. 
మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని తన నివాసంలో డిఎల్  విలేకర్లతో ముచ్చటించారు. వివేకం సినిమా చూసి ఓటేయాలని తన వద్దకు వచ్చిన వారికి చెబుతున్నట్టు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాబు పద్ధతి గల నాయకుడని, ప్రజలకు ఆయన మాత్రమే మేలు చేస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. ‘‘మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డికి ఓటు వేయొద్దు. టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కే నా మద్దతు’’ అని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఎల్ టిడిపి మైదుకూరు అభ్యర్థి పుట్టా సుధాకర్ కు మద్దతునిస్తూ కడప వైఎస్ ఆర్ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిని ఓడించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. 

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.