దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం!

Publish Date:Aug 11, 2024

Advertisement

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ ఎపిసోడ్‌లో మరో భారీ ట్విస్ట్ క్రియేట్ అయింది. శ్రీనివాస్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఆయన భార్య వాణి, కుమార్తెలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం టెక్కలి వైసీపీ నాయకురాలు, దువ్వాడ శ్రీనివాస్‌తో ‘అడల్ట్రీ’ చేస్తున్న దివ్వెల మాధురి కారు ప్రమాదంలో గాయపడ్డారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును మాధురి ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో తన కారుతో ఢీ కొట్టింది. దాంతో రెండు కార్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు ఆమె జూమ్ కాల్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.  

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మీడియాతో మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు. డిప్రెషన్లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకునేందుకే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు మాధురి తెలిపారు. తాను మొదట లారీని ఢీకొట్టాలని అనుకున్నానని, కానీ కారుకు ఢీకొట్టానని ఆమె చెబుతున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు రాజకీయ రంగు పులమటానికి మాధురి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అలాగే మాధురి ఢీకొట్టిన కారులో వున్న వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ ‘ఆయనకిద్దరు’ సినిమా ఫలితంగా ఏ పాపమూ ఎరుగని వాళ్ళు మృత్యువుతో పోరాడుతున్నారు.

By
en-us Political News

  
పదేళ్లుగా పెండింగ్‌లో రూ.20 కోట్ల విలువైన స్థలం.. పఠాన్ ఎన్డీఏలో చేరగానే గిఫ్ట్.!
హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.