యూపీ సీఎం యోగికి అసమ్మతి సెగ.. మంత్రి రాజీనామా

Publish Date:Jul 20, 2022

Advertisement

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు  రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల   అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.  

బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.   ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్   మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు.  చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు.

దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.  

అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో  ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.

By
en-us Political News

  
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.